Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
ప్రాచీన ధాన్యం,ఆధునిక ఆరోగ్యం..రుచికరమైన కొర్రల పొంగలి ఎలా చేసుకోవాలంటే
ప్రాచీన కాలం నుండి భారతదేశంలో సాగుచేయబడుతున్న చిరుధాన్యాలలో కొర్రలు ఒకటి. గత కొన్నేళ్లుగా ఆరోగ్యం పట్ల పెరుగుతున్న అవగాహనతో కొర్రలు వంటి చిరుధాన్యాలు తిరిగి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. సాంప్రదాయ వంటకాల్లో బియ్యానికి బదులుగా కొర్రలను ఉపయోగించడం ఆరోగ్యకరమైన అలవాటుగా మారింది. అలాంటి వాటిల్లో ఒకటి కొర్రల పొంగలి. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, పోషకాలతో నిండిన అద్భుతమైన అల్పాహారం లేదా తేలికపాటి భోజనం. దీనిని ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం తేలికపాటి భోజనంగా తీసుకోవచ్చు. కొర్రలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది సులభంగా జీర్ణమవుతుంది, పోషకమైనది. కొర్రల పొంగలి తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కొర్రల పొంగలి తయారీకి కావలసిన పదార్థాలు
-కొర్రలు: 1 కప్పు (200 గ్రాములు)
-పెసర పప్పు: 1/2 కప్పు
-నీరు: 4-5 కప్పులు
-నెయ్యి: 2-3 టేబుల్ స్పూన్లు
-జీలకర్ర: 1 టీస్పూన్
-మిరియాలు: 10-12
-పచ్చిమిర్చి: 2-3
-అల్లం: 1 అంగుళం ముక్క
-కరివేపాకు: 1 రెమ్మ
-జీడిపప్పు: 10-15
-ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం
-ముందుగా కొర్రలు, పెసర పప్పును విడివిడిగా 2-3 సార్లు నీటితో శుభ్రంగా కడగాలి. కొర్రలను కనీసం 30 నిమిషాల నుండి 1 గంట వరకు పెసర పప్పును 15-20 నిమిషాల వరకు నానబెట్టాలి.
-తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టి అందులో నానబెట్టిన కొర్రలు, పెసర పప్పు వేసి ఇందులో 5 కప్పులు నీరు పోయండి. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. కుక్కర్ మూత పెట్టి మీడియం మంటపై 3-4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించండి.
-ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మూత తెరిచి ఒక గరిటెతో బాగా కలపండి. ఇది మెత్తగా, పొంగలి లాగా సిద్ధంగా ఉండాలి.
-ఇఫ్పుడు ఒక చిన్న కళాయిలో లేదా పోపు గిన్నెలో నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక జీలకర్ర, మిరియాలు వేసి చిటపటలాడనిచ్చాక సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేయించండి. చివరగా జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి స్టవ్ ఆపేయండి.
-సిద్ధం చేసుకున్న పోపును ఉడికించిన కొర్రల పొంగలి మిశ్రమంలో వేసి బాగా కలపండి. వేడి వేడిగా కొబ్బరి చట్నీ, సాంబార్ లేదా పచ్చడితో సర్వ్ చేసుకుంటే అద్భుతం అనాల్సిందే.
కొర్రల పొంగలి ఆరోగ్య ప్రయోజనాలు
కొర్రల్లో అధిక మొత్తంలో పీచు పదార్థం (ఫైబర్) ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు కలిగిస్తుంది, ఇది అతిగా తినడాన్ని నివారించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కొర్రలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంటాయి.. అంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి. ఇది మధుమేహగ్రస్తులకు లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిరంతరం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
కొర్రల్లో ఉండే ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications