Latest Updates
-
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
పూల్ మఖానా మసాలా కర్రీ..అన్నం,రోటీ,పూరీ,పరాటాలకు అద్భుతమైన సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే..
మనదేశంలో వంటకాల్లో వైవిధ్యం,రుచికి కొదవేలేదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ప్రత్యేకమైన వంటకాలు,పదార్థాలు ఉంటాయి. అలాంటి వాటిల్లో పూల్ మఖానా ఒకటి. పూల్ మఖానాని తామర గింజలు అని కూడా పిలుస్తుంటారు. ఈ పూల్ మఖానాని ఎక్కువగా ఉపవాసాల సమయంలో స్నాక్స్ గా లేదా పాయసం వంటి తీపి వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. అయితే దీంతో అద్భుతమైన రుచికరమైన మసాలా కర్రీ కూడా చేసుకోవచ్చు. అన్నం, రోటీ, పూరీ, పరాటా,బిర్యానీలోకి కూడా అద్భుతమైన సైడ్ డిష్ గా పూల్ మఖానా మసాలా కర్రీ ఉంటుది.
పూల్ మఖానా మసాలా కర్రీని తయారు చేయడం చాలా సులభం.. తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. ఇది రిచ్, క్రీముగా, కొద్దిగా కారంగా ఉండే గ్రేవీతో రుచిగా ఉంటుంది. ఈ వంటకం రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీ ఇంట్లోనే పూల్ మఖానా మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో, దానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

ఫుల్ మఖానా మసాలా కర్రీ తయారీకి కావాల్సిన
పదార్థాలు
-పూల్ మఖానా
-నెయ్యి లేదా నూనె
-ఉల్లిపాయ
-టొమాటో
-అల్లం
-వెల్లుల్లి
-పచ్చిమిర్చి
-జీడిపప్పు
-పెరుగు
-నీరు
-ఉప్పు
-పసుపు
-కారం
-ధనియాల పొడి
-జీలకర్ర పొడి
--కసూరీ మేథీ
-జీలకర్ర
-లవంగాలు
-యాలకులు
-దాల్చిన చెక్క
-బిర్యానీ ఆకు
-కొత్తిమీర తరుగు
తయారీ విధానం
-స్టవ్ మీద వెడల్పాటి పాన్ లేదా కడాయి పెట్టవి అందులో 1-2 టీస్పూన్ నెయ్యి లేదా నూనె వేసి వేడి చేశాక ఇందులో ఒకటింబావు కప్పు పూల్ మఖానా వేసి మీడియం మంట మీద 2-3 నిమిషాలు కలుపుతూ బాగా వేయించి ఓ ప్లేట్ లోకి తీసుకని పక్కన పెట్టుకోండి.
-మిక్సీ గిన్నెలో రెండు కట్ చేసిన పెద్ద సైజు టమాటో ముక్కలు, 10 జీడిపప్పు పలుకులు, 3 యాలకలు, చిన్న దాల్చిన చెక్క, పొట్టు తీసిన 8 వెల్లుల్లి రెబ్బలు, అర టీస్పూన్ జీలకర్ర, 1 ఇంచు పొట్టు తీసేసిన అల్లం ముక్క, 5 లవంగ మొగ్గలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. కావాలనుకుంటే కొంచెం నీళ్లు పోసి అయినా మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి 2 బిర్యానీ ఆకులు, అర కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారుతున్న సమయంలో అందులో పెద్దగా చీరిన 2 పచ్చిమిరపకాయలు, గ్రైండ్ చేసుకున్న టమాటో మిశ్రమం పేస్ట్ వేసి కలిపి మీడియం మంట మీద కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి.
-ఆయిల్ సపరేట్ అవుతున్న సమయంలో పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు , 2 టీస్పూన్ల కారం, 2 టీస్పూన్ల ధనియాల పొడి వేసి బాగా కలపాలి. మంటను తక్కువలో ఉంచాలి
-తర్వాత అందులో 2-3 టేబుల్ స్పూన్ల మంచి పెరుగు లేదా ఫ్రెష్ క్రీమ్ అయినా వేసి బాగా కలపాలి.
-ఉడకడం ప్రారంభం అయ్యాక అందులో గ్రేవీ చిక్కదనాన్ని బట్టి నీటిని పోసుకోండి.2-3 నిమిషాలు గ్రేవీని బాగా ఉడకనివ్వండి.
-తర్వాత అందులో ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మఖానా వేసి గ్రేవీ మొత్తం ఫుల్ మఖానాకి పట్టేలా బాగా కలపాలి. మూతపెట్టి తక్కువ మంట మీద 2 నిమిషాలు ఉడికించాలి. ఫుల్ మఖానా త్వరగానే ఉడికిపోతుంది..కాబట్టి ఎక్కువసేపు ఉడికించనక్కర్లేదు.
-చివరిగా 1 టీస్పూన్ కసూరి మేథీని నలిపి అందులో వేయండి,కొత్తిమీర తరుగు కూడా వేసి 1 నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే నోరూరించే పూల్ మఖానా మసాలా కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications