Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
హోటల్ స్టైల్ టిఫిన్ సాంబార్..ఇడ్లీ,వడ,రైస్ లోకి అయినా కేక..ఎలా చేసుకోవాలంటే
సాంబార్ పేరు వినగానే మనకు వేడి వేడి ఇడ్లీ, వడ గుర్తుకు వస్తాయి. పొద్దు పొద్దున్నే ఇడ్లీ, వడల్లో సాంబార్ కలుపుకొని తింటుంటే ఆ మజా మాటల్లో వర్ణించలేరు. ముఖ్యంగా టిఫిన్ సెంటర్లలో ఇచ్చే సాంబార్ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆ సాంబార్ లోని కమ్మదనం, ప్రత్యేకమైన వాసన మనకు ఇంట్లో చేసిన సాంబార్ లో రాదు. హోటల్ సాంబార్ లో ఏ మ్యాజిక్ ఉంటుందని చాలామంది అనుకుంటారు. నిజానికి దాని వెనుక పెద్ద రహస్యాలేమీ లేవు, కొన్ని చిన్న చిన్న చిట్కాలు, సరైన పదార్థాలు వాడితే మనం కూడా ఇంట్లోనే అదే రుచిని సాధించవచ్చు. మీ ఇంట్లోనే చాలా ఈజీగా హోటల్ స్టైల్ టిఫిన్ సాంబార్ ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి
తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఎండుమిర్చి
-కరివేపాకు
-ధనియాలు
-కందిపప్పు
-మినపప్పు
-పచ్చి శెనగపప్పు
-ఆవాలు
-ఇంగువ
-చింతపండు
-మెంతులు లేదా మెంతిపిండి
-నచ్చిన కూరగయాల ముక్కలు
-ఆయిల్
-కొత్తిమీర
-మిరియాల పొడి
-నీళ్లు

తయారీ విధానం
-ముందుగా నిమ్మకాయ సైజు అంత చింతపండుని నీళ్లు పోసి నానబెట్టాలి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 టీస్పూన్ ఆయిల్ వేసి వేడి చెయ్యాలి.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శెగనపప్పు, కొద్దిగా ఇంగువ వేసి వేయించుకోవాలి.
-పప్పులన్నీ వేగిన తర్వాత అందులో కొబ్బరి ముక్క లేదా కొబ్బరి పొడి, కరివేపాకు, 6 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి తక్కువ మంట మీద మాడకుండా వేయించుకొని తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత వేయించిన మొత్తం మిక్సీ జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి. వేడెక్కిన ఆయిల్ లో 1 టీస్పూన్ ఆవాలు వేసి చిట్టనిచ్చాక 3 ఎండుమిరపకాయలు, 1 ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయల చీలికలు వేసి వేగనిచ్చాక అందులో కరివేపాకు వేసి కలపాలి.
-ఇప్పుడు అందులో వేయించి పొడి చేసుకున్న మెంతిపిండి,పావు టీస్పూన్ పసుపు వేసి బాగా కలుపుకున్నాక మీకు నచ్చిన కూరగాయ ముక్కలను కట్ చేసి ఇందులో వేసుకోవాలి.(4 గుమ్మడికాయ ముక్కలు, 2 సొరకాయ ముక్కలు, 1 టమాటో, 1 బెండకాయ ముక్కలు, మునగకాయ ముక్కలు, 1 వంకాయ).
-తక్కువ మంట మీద కూరగాయ ముక్కలను మగ్గనివ్వాలి. ఇందులోనే 1 టీస్పూన్ నల్లమిరియాల పొడి, 1 టీస్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టిన చింతపండు రసం, తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి మూతపెట్టి 5-10 నిమిషాలు తక్కువ మంట మీద ఉడకనివ్వాలి.
-తర్వాత మూత తీసి అందులో మిక్సీ వేసి రెడీ చేసుకున్న పేస్ట్ ని వేసి బాగా కలిపాక ఇందులో కొంచెం బెల్లం, 1 టేబుల్ స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయ మిశ్రమం వేసి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంట మీద 20-30 నిమిషాలు మరగనివ్వాలి.
-చివర్లో కొంచెం కొత్తిమీర తరుగు చల్లుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంటే టిఫిన్ సాంబార్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications