Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పూరీ కుర్మా : హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఇలా సింపుల్ గా తయారుచేసుకోండి.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు మీరు తరచుగా మీ ఇంట్లో పూరీలు చేస్తారా? అయితే అందుకు కాంబినేషన్ గా గ్రేవీ, చట్నీ , కూరలు వంటివి బోరుకొడుతుంటే. హోటల్ స్టైల్లో పూరి కుర్మాను ట్రై చేయండి. అందుకు రెండు మూడు రకాల తాజా కూరగాయలు ఉంటే చాలు. పూరీలోకి కుర్మా రెడీ.
సాధారణంగా పూరీ సాగును వివిధ రకాలుగా తయారుచేసుకుంటారు. అయితే ఫర్ఫెక్ట్ హోటల్ స్టైల్ పూరీ కుర్మాను ఎలా తయారు చేయాలో అందుకు కావాల్సిపదార్థాలు ఏంటో తెలుసుకోవాలి. కావాల్సిన పదార్థాలన్నీ ఉన్నప్పుడు దీన్ని తయారుచేయడం చాలా సులభం. ఇంట్లో ప్రతి ఒక్కరీ దీన్ని ఇష్టపడతారు.

సింపుల్‌గా పూరీ మసాలా ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ పూరీ మసాలా యొక్క సాధారణ వంటకం క్రింద ఉంది. చదివి రుచి చూసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
కావాల్సిన పదార్థాలు:
* ఆలూ : 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
* క్యారెట: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
* బీన్స్: 1 కప్పు (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
* పచ్చి బఠానీలు - 1 కప్పు
* నూనె - 2 టేబుల్ స్పూన్లు
* ఉల్లిపాయలు - 3 (సన్నగా తరిగినవి)
* టమోటో - 1 (సన్నగా తరిగినవి)
* శనగ పిండి - 2 టేబుల్ స్పూన్లు
* మిరియాల పొడి - 1 టేబుల్ స్పూన్
* పసుపు పొడి . 1 టేబుల్ స్పూన్
* ఉప్పు - రుచి ప్రకారం
రుబ్బుకోవడానికి...
* పచ్చిమిర్చి - 4
* అల్లం - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినవి)
* వెల్లుల్లి - 6 రెబ్బలు
తయారుచేయు విధానం:
* ముందుగా వెజిటేబుల్ ముక్కలన్నీ పాన్ లో వేసి సరిపడా నీళ్ళు పోసి
ఉడికించి పెట్టుకోవాలి.
* తర్వాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని మిక్సీ జార్‌లో
వేసి పేస్ట్‌లా చేసుకోవాలి.
* తర్వాత స్టౌమీద పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడి
చేయాలి.
* తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి, కొద్దిగా ఉప్పు చల్లి మెత్తగా
వేయించాలి.
* తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్ట్ వేసి 1 నిమిషం
వేయించాలి.
* తర్వాత అందులో టొమాటోలు వేసి మెత్తగా వేయించాలి.
* తర్వాత పసుపు, కారం వేసి బాగా కలపాలి.
* ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకు కూరగాయల ముక్కలు, పచ్చిబఠానీలు
వేసి కలపాలి, అవసరమైనంత నీరు పోసి బాగా మరిగించాలి.
* చివరగా శెనగ పిండిని నీళ్లలో కరిగించి పోసి మరిగిస్తే రుచికరమైన
పూరీ మసాలా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications