Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఆఫ్రికన్స్ ఎక్కువగా తినేది ఇదే, అందుకే వారు అంత ఫిట్‌గా ఉంటారు.. ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేసుకోవాలంటే?
ప్రతి దేశంలో ప్రత్యేకమైన ఆచార సంప్రదాయాలు, ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఒక దేశంలో తినే ఆహరం ఇంకో దేశానికి చెందిన ప్రజలు తినాలంటే కొంత జంకుతారు కూడా. కానీ చాలా మందికి ఒక్కసారైనా ఆ ఆహారాన్ని రుచి చూడాలి, వాటిని తినాలని ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఆ దేశానికి వెళ్లలేక, ఆ ఆహారాన్ని రుచి చూడలేక అలానే ఉండిపోతారు. అందుకే ఈ రోజు ఈ స్టోరీలో మనం ఆఫ్రికాలో నివసించే ఆదివాసీలు ఎక్కువగా తినే ఉగాళీ గురించి తెలుసుకుందాం. దీనిని ఎలా చేసుకుంటారు? ఈ ఉగాళీ తయారికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం రండి.
మనందరికీ తెలుసు.. ఆఫ్రికాలో ఎక్కువగా బీద దేశాలు ఉంటాయి. అక్కడి ప్రజలు చాలా పేదరికంలో ఉంటారు. అందుకే వారు చాలా ఖర్చు తక్కువయ్యే ఆహారాలను ఎంచుకోవడంతో పాటు, ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చే ఆహారపదార్థాల వైపు మొగ్గు చూపుతుంటారు. అందులో ఒకటి ఉగాళీ. దీనికి చాలా తక్కువ పదార్థాలు అవసరమవుతాయి.

ఉగాళీ తయారీకి కావాల్సిన పదార్థాలు:
మొక్కజొన్న పిండి: 2 కప్పులు
నీరు: 4 కప్పులు
తయారీ విధానం:
మొదటగా ఒక మందపాటి గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి.
నీరు బాగా వేడెక్కిన తర్వాత, మంటను తగ్గించి మొక్కజొన్న పిండిని
కొద్దికొద్దిగా వేస్తూ ఉండాలి.
పిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి.
పిండి గట్టిపడే వరకు సుమారు 15-20 నిమిషాల పాటు ఉడికించాలి.
పిండి గట్టిపడి, గిన్నె అంచులను వదిలేసిన తర్వాత, మంటను ఆపివేయాలి.
అంతే ఆఫ్రికాన్స్ ఎంతో ఇష్టంగా తినే, ఉగాళీ సిద్ధమైనట్లే.
ఉగాళీని ఒక ప్లేటులోకి తీసుకుని, మీకు నచ్చిన కూర లేదా మాంసంతో కలిపి
వడ్డించుకొని తినేయొచ్చు.
చిట్కాలు:
ఉగాళీని మరింత రుచిగా చేయడానికి, మీరు కొద్దిగా ఉప్పు లేదా నూనెను
కూడా కలపవచ్చు.
ఉగాళీని వేడిగా ఉన్నప్పుడే వడ్డించడం మంచిది.
మీకు కావాలంటే ఉగాళీని చిన్న చిన్న ముక్కలుగా చేసి కూడా తినవచ్చు.
ఉగాళీ చేయడానికి మందపాటి గిన్నెను ఉపయోగించడం వలన అది అడుగంటకుండా
ఉంటుంది.
ఉగాళీని కలుపుతున్నప్పుడు, అది ఉండలు కట్టకుండా చూసుకోవాలి.
ఉగాళీని ఆఫ్రికాలో ఎక్కువగా మాంసం, కూరగాయలతో కలిపి తింటారు. ఇది
అక్కడ ప్రధాన ఆహారాలలో ఒకటి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications