Latest Updates
-
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే..
పాతకాలం నాటి వంట ఇది.. వంకాయ ఉల్లికారం,తింటే కంచం మొత్తం ఊడ్చేస్తారు, ఎలా చేసుకోవాలంటే?
మన పాతకంలో వంటలు చాలా రుచికరంగా ఉండేవి. ఆ వంటకాలు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేసేవి. అవి తినడం వలనే అప్పటి మనుషులు ఇప్పటికీ చాలా బలంగా ఉండడంతో పాటు ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారు. ఆ కాలంలో ఎలాంటి మసాలాలు లేకుండా ఉండే ఆహారాన్నే ఎక్కువగా తీసుకునే వారు. అలాంటి వంటకాల్లో ఒకటే ఉల్లిపాయ వంకాయ కారం. ఈ కూరలో ఎలాంటి మసాలాలు అవసరం లేదు. అలాగే చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వంట రాని వ్యక్తులు కూడా దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకే ఈ స్టోరీలో ఈ వంకాయ ఉల్లిపాయ కారం ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది వివరించాము. పూర్తిగా చదివి మీరు కూడా ట్రై చేయండి.
ఉల్లిపాయ వంకాయ కారం తయారీకి కావాల్సిన పదార్థాలు
750 గ్రాముల వంకాయలు
రెండు రెబ్బల కరివేపాకు
20 ఎండు మిరపకాయలు
5 పెద్ద సైజు ఉల్లిపాయలు
ఉప్పు నీరు
ఒక చెంచా ఆవాలు
ఒక చెంచా జీలకర్ర
అయిదు చెంచాల నూనె
రుచికి సరిపడా ఉప్పు

ఉల్లిపాయ వంకాయ కారం తయారీ విధానం
ఈ ఉల్లిపాయ వంకాయ కారం తయారు చేసుకోవడానికి ముందు.. ఉల్లిపాయలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కడాయిలో నూనె వేసి.. దాంట్లో 20 ఎండు మిరపకాయలను వేసుకొని.. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ముందుగానే తీసుకున్న వంకాయలను కిందవైపు నుంచి సగం నాలుగు రెండు గాట్లు పెట్టుకొని, నాలుగు భాగాలు చేసుకోవాలి. గుత్తి వంకాయల మాదిరిగా గాట్లు పెట్టుకొని.. ఉప్పు నీళ్లలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వంకాయ ముక్కలు తాజాగా ఉండడంతో పాటు ఎలాంటి మరక పడకుండా ఉంటుంది.
ఇప్పుడు ముందుగా ఎండు మిరపకాయలను వేయించుకున్న కడాయిలో ఇంకో రెండు చెంచాల నూనె వేసుకొని అందులో చీల్చి పెట్టుకున్న వంకాయలను వేసుకొని 50 శాతం ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత ఆ వంకాయలను చల్లార్చడానికి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలను రోటిలో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయలను కూడా వేసుకొని.. కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ రెండిటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గాట్లు పెట్టుకున్న వంకాయలో ఉల్లిపాయ మసాలాను వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని వంకాయలకు అలానే పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
కర్ణాటక స్పెషల్ మామిడి గులాంబ.. తింటే మీలోని రుచిరాజు నాట్యం చేయాల్సిందే, ఎలా చేసుకోవాలంటే
ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో మూడు చెంచాల నూనె వేసుకోవాలి. ఆ నూనెలో ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి. అవి రెండు చిటపటాలాడినాక అందులో రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో మసాలా వేసుకొని పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి. వంకాయలకు దట్టించిన తరువాత మిగిలిన మసాలాను కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆ వంకాయలను మెల్లిగా తిప్పుకుంటూ మేత్తగా అయ్యేవరకు వేయించుకోవాలి. మీడియం మంట మీద అలానే మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. వంకాయలు మెత్తబడితే, కిందకు దించుకోవడమే. ఎంతో రుచికరమైన ఉల్లిపాయ వంకాయ కారం రెడీ అయినట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications