Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ది మ్యాజిక్ ఆఫ్ ఆంధ్రా-స్టైల్: స్పైసీ చికెన్ పెప్పర్ ఫ్రైడ్ రైస్
Chicken Pepper Fried Rice దక్షిణ భారత దేశంలో ఆంధ్ర రాష్ట్రం, లెక్కపెట్టలేనన్ని వంటలు, అద్భుతమైన రుచులు మరియు సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఈ వంటల స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక వంటకం ఆంధ్రా-స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఈ నోరూరించే వంటకం చికెన్, సువాసనగల బాస్మతి రైస్ మరియు మసాలా దినుసులను మిళితం చేస్తుంది, ఇది ఆంధ్రా వంటకాలలో ప్రధానమైనది.
మిరపకాయలు, సుగంధ ద్రవ్యాలు మరియు మసాలా దినుసులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆంధ్ర వంటకాలు విభిన్నంగా ఉంటాయి,ఈ వంటలు ఇతర ఏ వంటకు సాటి రావు. అందులో ఒకటి చికెన్ ఫ్రైడ్ రైస్. ఆంధ్రా-శైలి చికెన్ ఫ్రైడ్ రైస్‌లో, కరివేపాకు, కొత్తిమీర మరియు జీలకర్ర వంటి స్థానిక మసాలా దినుసులను జోడించడం వల్ల డిష్ కొత్త రుచిలను అందిస్తుంది. మరి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారుచేయాలి. అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Image Courtesy Kikifoodies
కావాల్సిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్ : 500 gms
ముందుగా వండి పెట్టుకున్న అన్నం
గుడ్డు: 3 లేదా 4 (పగలగొట్టి, లోపల ఎల్లో వైట్ ను బాగా మిక్స్ చేసి
పక్కన పెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినవి)
క్యాప్సికం : 1 (సన్నగా తరిగినవి)
క్యారెట్ : 1 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి : 5 (సన్నగా తరిగినవి)
అల్లం: చిన్నముక్క లేదా ఒక అంగుళం (సన్నగా తరిగినవి) లేదా పేస్ట్ కూడా
వేసుకోవచ్చు
వెల్లుల్లి రెబ్బలు : 5 (సన్నగా తరిగినవి)
స్ప్రింగ్ ఆనియన్(గ్రీన్ లీవ్స్) (సన్నగా తరిగినవి)
మిరియాల పొడి: 1 టీస్పూన్
గ్రీన్ చిల్లీ సాస్ 1 టీస్పూన్
రెడ్ చిల్లీ సాస్ : 1 టీస్పూన్
సోయాసాస్ : 1 టీస్పూన్
వెనిగర్ : 1 టీస్పూన్
ఉప్పు రుచికి సరిపడా
నూనె సరిపడా
ఆలివ్ ఆయిల్ లేదా వెజిటేబుల్ ఆయిల్ :1 టేబుల్ స్పూన్
తయారుచేయు విధానం
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత అందులో చికెన్ ముక్కలను వేసి వాటి మీద కొద్దిగా మిరియాల పొడిని చల్లి ఒక 5 నిముషాలు వేగించుకోవాలి. అవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి.
2. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి రెండు నిముషాలు వేగించాలి.
3. తర్వాత అందులో నే క్యారెట్, క్యాప్సికం, ముక్కలు వేసి వేగించాలి.
4. తర్వాత గుడ్డు పోసి వేగించాలి. మొత్తం వేగిన తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకున్న అన్న వేసి కలుపుతూ ఫ్రై చేయాలి.
5. ఒక రెండు మూడు నిముషాల తర్వాత కారం పొడి, ఉప్పు, మిరియాల పొడి, వేసి ఒక నిముషం కలుపుతూ వేగించాలి
6. వెంటనే గ్రీన్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్ వేసి మొత్తం మిశ్రమాన్ని వేగిస్తూ కలుపుకోవాలి. తర్వాత మరీ డ్రైగా లేకుండా అవసరం అయితే ఇంకొద్దిగా ఉప్పు వేసి కలపాలి.
7. తర్వాత స్ప్రింగ్ ఆనియన్(గ్రీన్ లీవ్స్) ముక్కలు కూడా వేసి పూర్తిగా వేగించుకోవాలి. మొత్తం మిశ్రమం కలిగిపితే వేడి వేడి గా సర్వ్ చేయాలి . అంతే చికెన్ పెప్పర్ ఫ్రైడ్ రైస్ రెడీ.
8. ఆంధ్రా-స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఒక ఘుమఘమలాడుతూ, స్పైసీగా నోరూరించే ఒక సంతృప్తికరమైన భోజనం. వేడి వేడిగా, కొత్తిమీరతో అలంకరించి, రైతా (పెరుగు పచ్చడి సైడ్ డిష్) లేదా పాపడుతో వడ్డించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications