Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఈ విధమైన చికెన్ రోస్ట్ మీరెప్పుడూ తిని ఉండరు, ఇండియాలో మొత్తంలో అక్కడ మాత్రమే దొరుకుతుంది, ఎలా చేసుకోవాలంటే?
Recipes
oi-Banothu Praveen Kumar
Posted By: Banothu Praveen Kumar
మీకు నాన్ వెజ్ ఇష్టమైతే, చికెన్‌తో కొత్త వంటకాలను ప్రయత్నించడం ఇష్టం ఉంటే, ఈ అస్సామీ స్టైల్ రోస్టెడ్ చికెన్ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయాలి. సాధారణ చికెన్ ఫ్రైతో పోలిస్తే ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే చేసుకోవడం కూడా అత్యంత సులభం. కేవలం సాధారణమైన పద్దతిలో చేసుకునే ఈ వంట ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రోస్టెడ్ చికెన్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చికెన్ - 500 గ్రాములు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - 1 tsp
కారం - 1 tsp
జీలకర్ర పొడి - 1 tsp
మిరియాల పొడి - 1 tsp
నిమ్మరసం - 3 tbsp
నల్ల నువ్వులు - ½ కప్పు
నూనె - 4 tbsp
వెల్లుల్లి పేస్ట్ - 1 tsp
అల్లం పేస్ట్ - 2 tsp
ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు

రోస్టెడ్ చికెన్ తయారీ విధానం
- ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో ఉంచాలి.
- అందులో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని 20 నిమిషాలు మెరినేట్ చేయాలి.
- ఆ తరువాత, ఒక పాన్ వేడి చేసి అందులో నల్ల నువ్వులను వేసి 1 నిమిషం వేయించాలి. వేయించిన నువ్వులు చల్లార్చి, మిక్సీ జార్లో వేసి నూనె, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి గ్రైండ్ చేసి పేస్ట్ గా చేసుకోవాలి.
- ఇప్పుడు ఈ పేస్టును పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మెరినేట్ చేసిన చికెన్ నుంచి అదనపు నీటిని తీసి, ఇంతకు ముందు చేసుకున్న పేస్ట్‌ను చికెన్‌లో బాగా కలపాలి. తర్వాత, మరో 30 నిమిషాలు మెరినేట్ చేయాలి.
- ఈ మధ్యలో, మీ మైక్రోవేవ్ ఓవెన్‌ను 180 డిగ్రీలకు ప్రీహీట్ చేయండి.
- ప్రీహీట్ చేసిన ఓవెన్లో ట్రేలో చికెన్ ముక్కలను పెట్టి 30 నిమిషాలు ఉడికించాలి.
- 30 నిమిషాలు ఉడికాక.. చికెన్‌ను ఓవెన్ నుంచి తీసి వెంటనే నెయ్యి లేదా వెన్నతో పూయండి.
- అంతే రుచికరమైన అస్సామీ రోస్టెడ్ చికెన్ రెడీ.
Comments
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.
[ of 5 - Users]
English summary
How to make assami style chicken roast at home in telugu
Story first published: Wednesday, February 12, 2025, 12:00 [IST]
Other articles published on Feb 12, 2025



Click it and Unblock the Notifications