Latest Updates
-
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే!
మొరాకో స్పెషల్ చికెన్ టాగిన్..జిందగీలో మర్చిపోలేని టేస్ట్,ఎలా చేసుకోవాలో చూడండి
చికెన్ తో అనేక రకాలు వెరైటీలు తయారుచేయవచ్చు. మనదేశంలో అయితే కొన్ని వెరైటీలు చాలా పాపులర్. అదేవిధంగా అనేక పాత వంటకాలకు చాలా ప్రిసిద్ది చెందిన మొరాకో దేశంలో చికెన్ తో చేసే ఓ రెసిపి ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోలేని విధంగా ఉంటుంది. అక్కడివాళ్లు ఈ వంటకాన్ని చికెన్ టాగిన్ అని పిలుస్తుంటారు. నిమ్మకాయలు, ఆలివ్ లను ఉపయోగించి తయారుచేసే మొరాకో స్పెషల్ చికెన్ టాగిన్ ను మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
చికెన్ టాగిన్ తయారీకి కావలసిన పదార్థాలు
-చికెన్ ముక్కలు
-కుంకుమ పువ్వు
-వెల్లుల్లి
-అల్లం పొడి
-జీలకర్ర పొడి
-నిమ్మ కాయ
-కొత్తిమీర
-పార్స్లీ ఆకులు
-కారం
-ఉప్పు
-పసుపు
-ఉల్లిపాయ
-ఆలివ్స్
-ఆయిల్

చికెన్ టాగిన్ తయారీ విధానం
-ముందుగా ఓ కప్పులో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి అందులో వేడి నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టాలి.
-తర్వాత రెండు నిమ్మకాయలను ముక్కలుగా కట్ చేసి అందులోని పల్ప్ ని తీసి దానిని సన్నగా తరగి పక్కన పెట్టుకోండి. నిమ్మ తొక్కను కూడా పక్కన పెట్టుకోండి.
-తర్వాత పార్స్లీ ఆకులను(కొత్తిమీరలాగే ఉండే మరో రకం ఆకు),కొత్తిమీర ఆకులను సన్నగా తరిగి పెట్టుకోవాలి.
-తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిని సన్నగా తరుగుకోవాలి.
-తర్వాత ఓ పెద్ద బౌల్ లో తరిగిన పార్స్లీ, కొత్తిమీర, వెల్లుల్లి తరుగు, నిమ్మ తరుగు, జీలకర్ర పొడి, అల్లం పొడి , కారం, నానబెట్టిన కుంకుమపువ్వు నీరు, ఆలివ్ ఆయిల్ కొద్దిగా వేసి మొత్తం బాగా కలపాలి.
-ఆ బౌల్ లోనే శుభ్రంగా కడిగి చికెన్ తొడ ముక్కలను(కావాలనుకుంటే ఇతర కోడి భాగాల ముక్కలు వేసుకోవచ్చు)వేసి మసాలాలన్నీ బాగా పట్టించి పైన మూతపెట్టి 1 గంటసేపు లేదా రాత్రంతా ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి.
-తర్వాత రెండు ఉల్లిపాయలను సన్నగా తరుగుకోవాలి.
మిగిలిపోయిన అన్నంతో ఆలూ రైస్..మీ జన్మలో ఇలాంటి రుచి చూసి ఉండదు,ఎలా చేయాలో చూడండి
-తర్వాత ఓ బౌల్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ పోసి అందులో ఉల్లిపాయ తరుగు వేయాలి. దీని మీద కొద్దిగా ఉప్పు, పసుపు చల్లి దీనిమీద కొన్ని మసాలాలు పట్టించిన చికెన్ ముక్కలు వేసి మూతపెట్టి 1 గంట సేపు పక్కనపెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బౌల్ లో ఉంచిన ఉల్లిపాయలు, చికెన్ ముక్కలను ఓ గిన్నెలో వేసి 15-20 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
-చికెన్ ముక్కలలో నుంచి నీరు వచ్చేదాకా ఉడికించిన తర్వాత మంటను తగ్గించి ముక్కలు ఉడికేదా ఉడికించాలి.
-తర్వాత అందులో నిమ్మరసం కొద్దిగా, ఆలివ్స్, ముందుగా పక్కనపెట్టుకున్న నిమ్మ తొక్కలు చికెన్ ముక్కలపై పెట్టాలి.
-ఈ సమయంలోనే ఉప్పు,కారం కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవాలి.
-గ్రేవీ చిక్కబడేంతవరకు ఓ 15 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే చికెన్ టాగిన్ రెడీ. దీనిని రోటీ,బ్రెడ్, చపాతీ వంటి వాటితో తింటే అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications