Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
బందర్ అంటే లడ్డూ ఫేమస్ అనుకుంటిరా..ఈ వరల్డ్ ఫేమస్ స్వీట్ తింటే స్వర్గమే,ఎలా చేయాలంటే
హల్వాలో వంద రకాలుంటాయి. అయితే అన్నింటిలోకెళ్లా బందర్ హల్వా చాలా ప్రత్యేకం. బందరు హల్వా.. ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం (బందర్) కు చెందిన ఒక ప్రసిద్ధ స్వీట్. గోధుమ పాలు, చక్కెర, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ తో తయారుచేసే దీని టేస్ట్ నోటికి ఒక్కసారి తగిలితే జన్మ జన్మలకి గుర్తుండిపోతుంది. నాలుక మళ్లీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటుంది. సాధారణంగా బందర్ అనగానే అందరికీ లడ్డూనే గుర్తుకొస్తుంది. కానీ అక్కడ తయారయ్యే హల్వా వరల్డ్ ఫేమస్ అని కొద్దిమంది ఫుడ్ లవర్స్ కి మాత్రమే తెలుసు.
అత్యంత రుచికరంగా ఉండే బందర్ హల్వాని మీ ఇంట్లో కూడా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

బందర్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు
గోధుమలు: 1 కప్పు
చక్కెర: ఒకటిన్నర కప్పులు
నెయ్యి: 1/2 కప్పు
డ్రై ప్రూట్స్: జీడిపప్పు, బాదం, కిస్మిస్ కొద్దిగా
యాలకుల పొడి: 1/2 టీస్పూన్
గుజరాత్,మహారాష్ట్ర స్పెషల్ రెసిపి..ఇది తినే వారికన్ని తెలివితేటలు,ఎలా చేయాలంటే
బందర్ హల్వా తయారీ విధానం
-ముందుగా గోధుమలను శుభ్రంగా కడిగి 8-10 గంటలు నానబెట్టాలి.
-నానిన గోధుమలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
-రుబ్బిన గోధుమలను పలుచని వస్త్రం ఉపయోగించి వడకట్టి పాలు తీసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెలో చక్కెర,నీరు వేసి పాకం తయారుచేసుకోవాలి. పాకం మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలి.
-పాకం కొద్దిగా చిక్కబడిన తర్వాత గోధుమ పాలు వేసి బాగా కలపాలి.
-నెయ్యి వేసి మిశ్రమం గట్టిపడే వరకు తిప్పుతూ ఉండాలి.
- తర్వాత అందులో జీడిపప్పు, బాదం, కిస్మిస్, యాలకుల పొడి వేసి కలపాలి. హల్వాకు రంగు కోసం ఫుడ్ కలర్ ను కూడా ఉపయోగించవచ్చు.
-హల్వాను నెయ్యి రాసిన ప్లేట్ లో వేసి చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత ముక్కలుగా కోస్తే చాలు. బందర్ హల్వా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
