Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
చిక్కుడుకాయ కూరను ఇలా వండుకుంటే.. గిన్నెలో ముద్ద అన్నం లేకుండా ఊడ్చేస్తారు, ఎలా అంటే?
ఈ మధ్య కాలంలో చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఐపోతున్నారు. చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగడం లేదు. దానిలో భాగంగానే చికెన్, మటన్, ఫిష్ అంటూ అలాంటి ఆహారాలు తింటున్నారు. కానీ ఒకప్పుడు చిక్కుడు కాయ కూర అంటే.. గిన్నెలో అన్నం మొత్తం ఖాళీ అయిపోయేది. కొంచెం కారం ఎక్కువగా వేసి చేసే ఆ వంట ఆహా ఏమి రుచి అనేలా ఉండేది. కానీ ఈ కాలం పిల్లలకు ఆ రుచి అదృష్టం చాలా తక్కువగా దొరుకుతుంది. అసలు ఆ కూర చేసుకునే విధానం కూడా కొంతమందికి తెలియదు. అందుకే ఈ స్టోరీలో చిక్కుడుకాయ కూర ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:
చిక్కుడుకాయలు: 1/2 కిలో
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)
టమాటాలు: 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి: 2-3 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
కారం: 1 టీస్పూన్
ధనియాల పొడి: 1/2 టీస్పూన్
పసుపు: 1/4 టీస్పూన్
జీలకర్ర: 1/2 టీస్పూన్
ఆవాలు: 1/2 టీస్పూన్
కరివేపాకు: 2 రెమ్మలు
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: కొద్దిగా (సన్నగా తరిగినది)
తయారీ విధానం:
చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్
చేసుకోవాలి.
స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. ఆవాలు, జీలకర్ర వేసి
చిటపటలాడనివ్వాలి.
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బంగారు రంగు వచ్చేవరకు
వేయించాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
టమాటాలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.
చిక్కుడుకాయ ముక్కలు వేసి బాగా కలిపి, మూత పెట్టి తక్కువ మంట మీద
10-15 నిమిషాలు ఉడికించాలి.
చిక్కుడుకాయలు మెత్తబడిన తర్వాత, కొత్తిమీర చల్లి దించాలి.
ఈ కూర అన్నం, చపాతీ, రోటీలతో చాలా రుచిగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications