Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బీట్రూట్ ఇడ్లీ.. మన పూర్వీకుల మాదిరిగా బలంగా ఉండాలంటే ఇది తినాల్సిందే, ఎలా చేసుకోవాలంటే!
ఇడ్లిలలో చాలా రకాలు ఉటాయి. ప్రతి ఒక్కరికీ ఇవి ఎంతో ఇష్టమైన అల్పాహారం. వీటిని చేసుకోవడం కూడా సులభం. అలాగే సులువుగా అరిగిపోతాయి కూడా. అయితే మీరెప్పుడైనా బీట్‌రూట్ ఇడ్లీలు తిన్నారా? ఇవి అచ్చం గులాబీ పువ్వుల మాదిరిగానే ఉంటాయి. వీటిని చేసుకోవడం కూడా చాలా సులభమైన ప్రక్రియ. ఈ స్టోరీలో మేము బీట్‌రూట్ ఇడ్లీ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
బియ్యం - రెండు కప్పులు
మినప్పప్పు - ఒక కప్పు
బీట్రూట్ - ఒకటి
నెయ్యి - ఒక స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం:
ఈ బీట్‌రూట్ ఇడ్లీ తయారు చేయడానికి ముందుగా బియ్యం, మినప్పప్పును విడివిడిగా కడిగి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే ఒక బీట్‌రూట్ తీసుకొని శుభ్రం చేసుకోవాలి. దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు నానబెట్టిన బియ్యం, మినప్పప్పును ఆ గంటల తరువాత మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. రెండింటిని కలిపి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బీట్రూట్ పేస్ట్‌ను కూడా ఇందులో కలిపి మిశ్రమాన్ని రాత్రిపూట పులియబెట్టాలి.
ఆ తరువాత ఇడ్లీ పాత్రలో ఈ బీట్‌రూట్ పేస్ట్ కలిపిన పిండిని పోసుకొని ఉడికించాలి. ఆ తరువాత ఇడ్లీలను తీసుకొని ఓ ప్లేట్‌లో పెట్టుకుంటే బీట్‌రూట్ ఇడ్లీలు సిద్ధమైనట్లే. వీటిని వేడి వేడిగా కొబ్బరి చట్నీతో లేదా సాంబార్‌తో తినొచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications