Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ బజ్జీలు తింటే, మిర్చి బజ్జీలను మర్చిపోతారు.. రుచి అమోఘం, సింపుల్‌గా ఎలా చేసుకోవాలంటే?
చేపల్లో చాలా రకాల చేపలు ఉన్నాయి. కొన్ని రకాల చేపలతో పులుసు, మరికొన్ని రకాల చేపలతో ఫ్రై చేసుకొని తింటారు. మరికొన్ని చేపలతో బిర్యానీ కూడా చేసుకొని తింటారు. అయితే చేపల్లో ఓ ప్రత్యేక రకమైన చేపలు ఉన్నాయి. ఏవ్ బొమ్మిడాయిలు. ఇవి చూడడానికి పాముల మాదిరిగా ఉంటాయి. కానీ వీటి రుచి అద్భుతంగా ఉంటుంది. వీటితో ఎక్కువగా పులుసు చేసుకొని తింటారు. కానీ మీరెప్పుడైనా బొమ్మిడాయిల బజ్జీలు తిన్నారా? అబ్బాబ్బా దీని రుచి మాత్రం మీరు ఊహించని విధంగా ఉంటుంది. ఒక్క ముక్క కూడా వదలకుండా మొత్తం లాగించేస్తారు అంతే. అయితే ఈ బొమ్మిడాయిలతో బజ్జిలు ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
బొమ్మిడాయిల బజ్జీలు తయారీకి కావాల్సిన పదార్థాలు
బొమ్మిడాయిలు - 5
కారం
పసుపు
ఉప్పు
శెనగ పొడి
జీలకర్ర
నీరు
నూనె
కొత్తిమీర
చాట్ మసాలా
ఒక నిమ్మకాయ

బొమ్మిడాయిల బజ్జిలు తయారీ విధానం
ముందుగా తీసుకున్న బొమ్మయిడాయిలను ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. వాటి పొట్ట చీల్చి.. అందులోని చెడు పదార్థాలన్నిటినీ తీసుకొని మరోసారి ఉప్పు వేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడు బొమ్మిడాయిలను ఒక ప్లేట్‌లో తీసుకొని.. వాటిపై ఒక చెంచా కారం, అర చెంచా పసుపు, కొంచెం ఉప్పు, అర బద్ద నిమ్మకాయ రసం పిండుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఇంకో ప్లేట్ తీసుకొని.. అందులో శెనగ పిండి వేసుకోవాలి. దానిపై కారం, జీలకర్ర, ఉప్పు, సోడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోని కొద్దిగా నీరు కలుపుకొని మరీ లూజ్ కాకుండా, మరీ గట్టిగా కాకుండా పిండిని కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో బజ్జీలు ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక.. శెనగ పిండిలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న బొమ్మిడాయిలను ముంచి నూనెలో వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక తీసుకోవాలి. అలా అన్ని బొమ్మిడాయిలను బజ్జీలుగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిపై సన్నగా తురుముకున్న కొత్తిమీరతో పాటు కొంచెం చాట్ మసాలా కూడా వేసుకొని ఓసారి కలుపుకొని, మిగిలిన అరబద్ద నిమ్మరసం పిండుకొని తినేయడమే. రుచి మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. మీరూ ఓసారి ట్రై చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications