Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇలాంటి దోశను మీరు అస్సలు తిని ఉండరు.. చాలా సాఫ్ట్‌గా, చాలా స్మూత్‌గా ఉంటుంది, టేస్ట్ అదిరిపోతుంది, ఎలా చేసుకోవ
ప్రతి ఒక్కరి ఇంట్లో ఉదయాన్నే లేవగానే ఏం టిఫిన్ చేయాలి అనే అయోమయం ఉంటుంది. ఆ అయోమయంలో ఏదైనా ఇడ్లీనో లేదా దోశనో లేకపోతే బోండానో చేసేస్తారు. అయితే ఈసారి మీ ఇంట్లో వెరైటీగా బన్ దోశ ట్రై చేయండి. ప్రస్తుతం చాలా ట్రేండింగ్‌లో ఉంది ఈ రెసిపీ. దీనిని చేసుకోవడం చాలా సులభం. కేవలం ఈజీ స్టెప్స్‌లో తయారు చేసుకోవచ్చు. అయితే చాలా మందికి దీనిని ఎలా చేసుకోవాలో తెలియదు. అందుకే ఈ స్టోరీలో బన్ దోశ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఏ విధంగా ఇది చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.

బన్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
రెండు కప్పుల ఉప్మా రవ్వ
ఒక కప్పు పెరుగు
రెండు స్పూన్ల జీలకర్ర
రెండు స్పూన్ల ఆవాలు
రెండు పచ్చిమిర్చి
కొద్దిగా కరివేపాకు
ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
ఒక ఉల్లిపాయ
రుచికి సరిపడా కారం
రుచికి సరిపడా ఉప్పు
ఒక ప్యాకెట్ ఈనో
దోశ వేసుకోవడానికి సరిపడా నూనె
తాలింపు
కొత్తిమీర
తయారీ విధానం..
ఈ బన్ దోశ తయారు చేసుకోవడం చాలా సులభం. కేవలం సులభమైన పద్దతిలో దీనిని తయారు చేసుకోవచ్చు. ఈ దోశ తయారు చేయడానికి ముందుగా.. రెండు కప్పల ఉప్మా రవ్వ తీసుకొని ఒక చిన్నపాటి గిన్నెలో పోసుకోవాలి. అందులోనే ఒక కప్పు పెరుగు కూడా పోసుకోవాలి. ఆ ఉప్మా రవ్వను పెరుగుతో పాటు కలిసే విధంగా బాగా కలుపుకొని.. ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ పది నిమిషాల్లో ఆ పిండి బాగా నానుతుంది.
ఈ క్రమంలో మనం ముందుగా.. తాలింపు వేసుకునే కడాయి తీసుకొని అందులో.. కొద్దిగా నూనె వేసుకోవాలి. అందులో జీలకర్ర, ఆవాలు, తాలింపు గింజలు, రెండు లేదా మూడు ఎండు మిరపకాయలు వేసుకొని బాగా తాలింపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ టైంలో ఉప్మా రవ్వ బాగా నాని ఉంటుంది.
ఇప్పుడు మరొక తాలింపు వేసుకొని గిన్నె తీసుకొని.. అందులో కొద్దిగా నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఆ రవ్వను తీసుకొని మిక్సీలో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న పిండి.. దోశ పిండిలాగా బాగా మెత్తగా వస్తుంది. ఆ పిండిని ఒక చిన్నపాటి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక ఈనో ప్యాకెట్‌ను చించి, నీటిలో కలుపుకొని అందులో పోసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పిండి అనేది బాగా పొంగుతుంది. అలాగే చాలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఆ పిండిలోని ఉల్లిపాయలతో చేసుకున్న తాలింపును వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు అదే తాలింపు గిన్నె తీసుకోవాలి. అందులో కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. ఆ నూనెలో దోశ పిండిని వేసుకోవాలి. సన్నటి మంట మీద ఆ దోశను కాలనివ్వాలి. అది బాగా పొంగి అద్భుతంగా తయారువుతుంది. రెండు వైపులా ఆ దోశను కాల్చుకోవాలి. ఆ తరువాత ఒక ప్లేట్‌లో తీసుకుంటే ఎంతో రుచికరమైన బన్ దోశ సిద్ధమైనట్లే. దీనిని వేడి వేడిగా ఏదైనా చట్నీలో నంచుకుని తింటే, అబ్బా ఆ రుచి అమోఘం, అద్భుతంగా నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications