Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బిర్యానీని మించిన టేస్ట్..ఇంట్లోనే చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలా చేసుకుంటే అదుర్స్ అంతే
సాధారణంగా సాయత్రం వేళల్లో చాలామంది సరదాగా బయటకు రోడ్డు మీదకో లేదా రెస్టారెంట్ కో వెళ్లి తినే ఫుడ్ లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి. ఒక్కో చోట ఒక్కో రకమైన టేస్ట్ తో దీనిని తయారచేస్తుంటారు. అయితే ఎప్పటిదో చికెన్ ను వాడి కూడా కొంతమంది చికెన్ ఫ్రైడ్ రైస్ తయారుచేస్తున్నారు.అయితే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ని ఇంట్లోనే చాలా ఈజీగా రెస్టారెంట్ దానికి మించిన టేస్ట్ తో తయారుచేసుకోవచ్చు. చికెన్ ఫ్రైడ్ రైస్ తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావలసిన
పదార్థాలు
-కారం
-ఉప్పు
-గరం మసాలా
-బాస్మతి బియ్యం
-బోన్ లెస్ చికెన్
-ధనియాలపొడి
-వేయించిన జీలకర్ర పొడి
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-బీన్స్ తరుగు
-క్యారెట్ తరుగు
-క్యాప్సికం తరుగు
-స్వీట్ కార్న్
-అల్లం తరుగు
-రెడ్ చిల్లీ సాస్
-డార్క్ సోయా సాస్
-స్వీట్ చిల్లీ సాస్
-వైట్ పెప్పర్ పౌడర్
-పల్లీలు
-బ్లాక్ పెప్పర్ పౌడర్
-కోడిగుడ్లు
-వెల్లుల్లి తరుగు
-కరివేపాకు

చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం
-ముందుగా 250 గ్రాముల బోన్ లెస్ చికెన్ ముక్కలు శుభ్రంగా కడిగిపెట్టుకోండి.
-తర్వాత ఓ బౌల్ లో చికెన్ ముక్కలు, 1 స్పూన్ కారం,1 స్పూన్ గరం మసాలా, అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా పట్టించండి.
-తర్వాత అందులో 2 టీస్పూన్ లు మొక్క జొన్న పిండి వేసి కలిపి అరగంట సేపు పక్కనపెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఆయిల్ వేడి చేసి చికెన్ ముక్కలు అందులో వేసి కదపకుండా 3 నిమిషాలు అలాగే వదిలేయండి.
-చికెన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత 2 నిమిషాలు వేపి తీసి ఓ ఫ్లేట్ లో పెట్టుకోండి.
-అదే బాండీలో ఉన్న ఆయిల్ అలాగే ఉంచి అందులోనే రెండు కోడిగుడ్లు పగలకొట్టి వేయండి. ముక్కలు గరిటతో కట్ చేస్తూ బాగా వేగిన తర్వాత అదే బాండీలో ఒక పక్కకి 1 టీస్పూన్ అల్లం తరుగు, 1 టీస్పూన్ వెల్లుల్లి సన్నని తరుగు వేసి, కొంచెం కరివేపాకు వేసి వేయించండి.
-తర్వాత అందులోనే పావుకప్పు బీన్స్ తరుగు, పావు కప్పు క్యారెట్ తరుగు,పావు కప్పు క్యాప్సికం తరుగు, 2 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్, అర కప్పు క్యాబేజీ తరుగు వేసి 1 నిమిషం పాటు కలుపుతూ వేయిస్తే చాలు.
-తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, కొంచెం బ్లాక్ పెప్పర్ వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు అందులో వండుకున్న బకటిన్నర కప్పు బాస్మతి రైస్ వేయండి. రైస్ మీద అర టీస్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల స్వీట్ చిల్లీ సాస్, అర స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, పావు టీస్పూన్ వేయించి పొట్టు తీసిన పల్లీలు, సరిపడా ఉప్పు వేసి అట్లకాడతో బాగా కలదిప్పుతూ ఉడికించుకోవాలి.
-తర్వాత అందులో ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు,కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications