Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పెళ్లిళ్లు, విందు భోజనాల్లో వడ్డించే దొండకాయ 65..దీని రుచి ముందు చికెన్,మటన్ కూడా వేస్ట్..ఎలా చేసుకోవాలంటే..
దొండకాయతో ఎన్నో రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. దొండకాయను కూరగా, వేపుడుగా, పచ్చడిగా, జ్యూస్ గా కూడా తీసుకోవచ్చు. దొండకాయతో చేసే వెరైటీల్లో దొండకాయ 65 ఒకటి. ఇది స్నాక్ గా, అన్నంలోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. దీనిని దొండకాయ పకోడీ లేదా వేపుడు అని కూడా అంటారు. సాధారణంగా ఎక్కువగా పండుగ భోజనాల్లో, విందులలో దీనిని పెడుతుంటారు. మీ ఇంట్లోనే ఎప్పుడు పడితే అప్పుడు చాలా ఈజీగా వెడ్డింగ్ స్పెషల్ దొండకాయ 65ను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
దొండకాయ 65తయారీకి కావాల్సిన పదార్థాలు
-దొండకాయలు: 250 గ్రాములు
-శనగపిండి: 3 టేబుల్ స్పూన్లు
-బియ్యప్పిండి: 2 టేబుల్ స్పూన్లు
-కారం: 1 టీస్పూన్
-ఉప్పు: రుచికి సరిపడా
-పసుపు: 1/2 టీస్పూన్
-అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
-పచ్చిమిర్చి: 1-2
-జీలకర్ర పొడి: 1/2 టీస్పూన్
-కరివేపాకు రెబ్బలు: కొన్ని
-పల్లీలు: 2 టేబుల్ స్పూన్లు
-నూనె: వేయించడానికి సరిపడా
-నిమ్మరసం: కొద్దిగా

తయారీ విధానం
-ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి, చివరలను కట్ చేయండి.
-తర్వాత దొండకాయలను నిలువుగా నాలుగు భాగాలుగా లేదా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా, కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి.
-స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో నీరు, కొద్దిగా ఉప్పు వేసి వేడి చేయండి. నీరు మరుగుతున్నప్పుడు దొండకాయ ముక్కలను వేసి 2-3 నిమిషాలు ఉడికించి వెంటనే నీటిని వడకట్టి, దొండకాయలను చల్లారనివ్వండి. ఇలా చేయడం వల్ల దొండకాయలు లోపల మెత్తబడి, పైన క్రిస్పీగా వేగుతాయి.
-ఒక పెద్ద గిన్నెలో చల్లారిన దొండకాయ ముక్కలను తీసుకోండి. ఇందులో శనగపిండి, బియ్యప్పిండి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి , జీలకర్ర పొడి వేయండి.
-నీళ్లు అస్సలు కలపకుండా దొండకాయలలోని తేమ సరిపోతుంది కాబట్టి పిండి మిశ్రమాన్ని దొండకాయ ముక్కలకు బాగా పట్టేలా కలపండి. అవసరమైతే చిలకరించినట్టుగా ఒకటి లేదా రెండు టీస్పూన్ల నీళ్లు మాత్రమే చల్లండి. పిండి గట్టిగా,ముక్కలకు బాగా అంటుకునేలా ఉండాలి. భజ్జి పిండిలా జారుడుగా ఉండకూడదు.
-ఒక మందపాటి కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి మీడియం మంటపై వేడి చేయండి.
-నూనె బాగా వేడయ్యాక దొండకాయ ముక్కలను ఒక్కొక్కటిగా విడివిడిగా నూనెలో వేయండి. ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా చూసుకోండి.
-మీడియం మంటపై 8-10 నిమిషాలు లేదా దొండకాయలు బాగా ఉడికి లేత గోధుమ రంగులోకి మారేవరకు వేయించండి. దొండకాయలు పూర్తిగా ఉడకడానికి కొంచెం సమయం పడుతుంది.
-దొండకాయలు ఉడికి రంగు మారడం మొదలుపెట్టగానే మంటను కొద్దిగా పెంచి, క్రిస్పీగా మారే వరకు వేయించండి. తర్వాత వాటిని నూనె నుండి తీసి టిష్యూ పేపర్ వేసిన ప్లేట్ లోకి మార్చండి.
-అదే నూనెలో పల్లీలను వేసి దోరగా వేయించి, కరివేపాకు రెబ్బలను కూడా వేసి అవి క్రిస్పీగా మారేవరకు వేయించండి.
-వేయించిన దొండకాయ ముక్కలు, పల్లీలు, కరివేపాకును ఒక గిన్నెలో వేసి, చిటికెడు కారం, జీలకర్ర పొడి, వేసి బాగా టాస్ చేయండి. కొద్దిగా నిమ్మరసం పిండితే రుచి మరింత పెరుగుతుంది.
-వేడి వేడి దొండకాయ 65ను స్నాక్ గా, అన్నంలోకి, పప్పు అన్నంలోకి లేదా సాంబార్ అన్నంలోకి సైడ్ డిష్ గా వడ్డించండి. ఈ దొండకాయ 65 చాలా రుచికరంగా, కరకరలాడుతూ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications