Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ దిబ్బరొట్టె ఢిల్లీలో ఫుల్ ఫేమస్.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, ఎలా చేసుకోవాలంటే?
మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల దిబ్బరొట్టెలు చేసుకొని తిని ఉంటారు. వాటి రుచి కేవలం పిండి పిండిగా ఉండడంతో పాటు అంతగా ఆస్వాదించే విధంగా ఉండలేకపోవచ్చు. కానీ ఢిల్లీలో ఓ ఫేమస్ దిబ్బరొట్టె ఉంది. దీనిని అక్కడి ప్రజలు ఎగబడి ఎగబడి మరీ కొనుక్కొని తింటారు. అదే డ్రై ఫ్రూట్స్ దిబ్బరొట్టె. దీనిని చేసుకోవడం చాలా సులభం. డ్రై ఫ్రూట్స్‌తో దీనిని తయారు చేస్తారు. ఇది రుచికరంగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిని ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
మినపప్పు - 1 కప్పు
బియ్యం - 2 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
జీడిపప్పు, బాదం, కిస్మిస్, పిస్తా - 1/2 కప్పు (సన్నగా
తరిగినవి)
యాలకుల పొడి - 1/2 టీస్పూన్

తయారీ విధానం:
మినపప్పు, బియ్యం వేర్వేరుగా 4-5 గంటలు నానబెట్టాలి.
మినపప్పును మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత బియ్యం కూడా మెత్తగా
రుబ్బుకోవాలి.
రెండు పిండిలను కలిపి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ పిండిని 8-10
గంటలు పులియనివ్వాలి.
పులిసిన పిండిలో తరిగిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి బాగా
కలపాలి.
మందపాటి గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి.
వేడి నూనెలో పిండిని వేసి, మూత పెట్టి చిన్న మంటపై 20-30 నిమిషాలు
ఉడికించాలి.
దిబ్బరొట్టె రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి.
చల్లారిన తర్వాత ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి. అంతే డ్రై ఫ్రూట్స్
దిబ్బరొట్టె సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications