Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
అందరికీ ఇష్టమైన ఎగ్ పఫ్.. సింపుల్‌గా ఇంట్లోనే ఈ విధంగా చేసుకోండి, బేకరీకి మించిన టేస్ట్
మనం ఎప్పుడైనా బేకరీకి వెళ్ళినప్పుడు అన్నిటికంటే ముందుగా అడిగేది ఏదైనా ఉందంటే అది ఎగ్ పఫ్ లేదా వెజ్ పఫ్. ఇవి ఫ్రెష్‌గా ఉండడంతో పాటు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. ఎప్పుడైనా వీటిని తినాలని అనిపించినప్పుడు కచ్చితంగా బేకరీకి వెళ్లాల్సిందే. ఎందుకంటే వీటిని ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలియదు. అందుకే ఈ స్టోరీలో ఎగ్ పఫ్ ఎలా చేసుకోవాలి? దానికి సంబంధించిన సింపుల్ రెసిపీ ఏంటి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం రండి.
ఎగ్ పఫ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
పఫ్ పేస్ట్రీ షీట్స్ - 6
గుడ్లు - 4
ఉల్లిపాయలు - 1 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1/2 టీస్పూన్
గరం మసాలా - 1/2 టీస్పూన్
పసుపు - 1/4 టీస్పూన్
కారం - 1/2 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 2 టేబుల్ స్పూన్లు
గుడ్డు (పైన రాయడానికి) - 1

తయారు చేయు విధానం:
- గుడ్లను ఉడికించి, పొట్టు తీసి, రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
- పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.
- ఒక నిమిషం వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి.
- పఫ్ పేస్ట్రీ షీట్లను చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి.
- ప్రతి షీటు మధ్యలో ఉల్లిపాయ మిశ్రమం, గుడ్డు ముక్క పెట్టి, చుట్టూ నీళ్ళు రాసి, పఫ్ లాగా మడవాలి.
- పైన గుడ్డు సొన రాయాలి.
- ఓవెన్ ను 180 డిగ్రీల సెల్సియస్ కు ముందుగా వేడి చేయాలి.
- పఫ్స్ ను బేకింగ్ ట్రేలో పెట్టి 20-25 నిమిషాలు బంగారు రంగు వచ్చేవరకు బేక్ చేయాలి. ఆ తరువాత తీసుకోవాలి. అంతే ఎగ్ పఫ్ సిద్ధమైనట్లే.
- వేడి వేడి ఎగ్ పఫ్స్ను టమాటో సాస్ తో సర్వ్ చేయాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications