Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
మంచి ప్రొటీన్ బ్రేక్ ఫాస్ట్.. ఎగ్ సేమియాను ఈ స్టైల్లో చేసుకున్నారా..?
ఎగ్ సేమియాను బ్రేక్ ఫాస్ట్ చేసుకొని తింటే రుచికి రుచి, శరీరానికి మంచి ప్రొటీన్‌ను అందించిన వారమౌతాము. ఎగ్ సేమియా కోసం మార్కెట్ నుంచి ప్రత్యేకంగా ఎలాంటి పదార్థాలు అవసరం లేదు. ఇంట్లో వున్న సేమియా, గుడ్లు, ఇంకా మంచి నూనె, కారం, మిరియాలపొడి, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర ఆకులు వుంటే సరిపోతుంది. మరి ఎగ్ సేమియాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

ఇక్కడ లిస్ట్‌లో ఇచ్చిన, ఇంట్లో వున్న వంట సామాగ్రితోనే ఎగ్ సేమియాను రెడీ చేసుకోవచ్చు.
ప్యాన్‌లో 1 టీ స్పూన్ ఆయిల్
1 కప్పు సేమియా
ఉప్పు
మూడు గుడ్లు
పావు టీస్పూన్ కారం
పావు టీ స్పూన్ మిరియాల పొడి
మంచి నూనె
1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి
ఉల్లిపాయ ముక్కలు
4 పచ్చిమిరపకాయ ముక్కలు
క్యారెట్ ముక్కలు
బీన్స్ ముక్కలు
క్యాప్సికం ముక్కలు
కొత్తిమీర ఆకులు
2 టీ స్పూన్ల నిమ్మరసం

ఎగ్ సేమియాని కింది విధంగా సింపుల్‌గా ఈజీగా తయారు చేకోవచ్చు.
1. ప్యాన్‌లో 1 టీ స్పూన్ ఆయిల్‌ను
వేసుకోవాలి.
2. 1 కప్పు సేమియా వేసి ఫ్రై చేయాలి.
3. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి సేమియా కలర్ మారేంత వరకు ఫ్రై
చేయాలి.
4. సేమియాలో 2,3 కప్పుల నీళ్లను తీసుకోవాలి.
5. నీళ్లను పోసుకున్న వెంటనే సేమియాను బాగా కలపాలి.
6. 1 కప్పు సేమియా వేసుకోవాలి.
7. సేమియా ఉడికిన తరువాత మళ్లీ బయటకు తీసుకొని ఆ సేమియాను బాగా
కడగాలి.
8. ప్యాన్ తీసుకొని 2,3 టీ స్పూన్ల మంచి నూనె వేసుకోవాలి.
9. మూడు గుడ్లను ప్యాన్‌లో పగలకొట్టాలి.
10. పావు టీస్పూన్ కారం, పావు టీ స్పూన్ మిరియాల పొడిని కూడా
వేసుకోవాలి.
11. ఎగ్ ఫ్రై అయిన తరువాత ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
12. ప్యాన్ లోకి మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ను
తీసుకోవాలి.
13. ప్యాన్‌లో ఫ్రెష్‌గా దంచిన 1 టీస్పూన్ అల్లం
వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి.
14. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, 4 పచ్చిమిరపకాయ ముక్కలను
తీసుకొని ఫ్రై చేయాలి.
15. సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలను, బీన్స్ ముక్కలను, క్యాప్సికం
ముక్కలను వేసుకొని ఫ్రై చేయాలి.
16. ఇందులో సేమియా వేసుకొని బాగా కలుపుకోవాలి.
17. రుచికి సరిపడ ఉప్పును ఇందులో వేసుకోవాలి.
18. అర టీస్పూన్ మిరియాల పొడి, అర టీస్పూన్ కారంపొడిని వేసుకొని
కలుపుకోవాలి.
19. కొన్ని కొత్తిమీర ఆకులను చల్లుకొని, 1,2 టీస్పూన్ నిమ్మరసాన్ని
పిండుకోవాలి.
20. దీంతో నోరూరించే రుచికరమైన ఎగ్ సేమియా రెడీ అయిపోయినట్టే
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications