Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కోడిగుడ్డుతో ఈ షేర్వా చేసుకొని తింటే ఒక్క మెతుకు అన్నం కూడా మిగల్చరు.. ఎలా చేసుకోవాలంటే?
ప్రతి ఇంట్లో కోడిగుడ్డు అంటే ఒక ఎమోషన్. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఓ గుడ్డు పగలగొట్టి, అందులో కారం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని అన్నం లాగించేస్తారు. చాలా సులభంగా, అతి తక్కువ ధరలో కోడి గుడ్డుతో అనేక రకాల వంటకాలు వండేస్తారు. ఇవి తినడానికి కూడా చాలా రుచికరంగా, అద్భుతంగా ఉంటాయి. అలాంటి కోడి గుడ్డు వంటల్లో ఒకటే కోడి గుడ్డు షేర్వా. ఈ కోడిగుడ్డు షేర్వా చాలా రుచికరంగా ఉంటుంది. సరిగ్గా చేసుకోవాలె కానీ.. మటన్ కన్నా అద్భుతంగా ఉంటుంది. దీనిని తినడం వలన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ పుష్కలంగా అందుతాయి. అలాగే చాలా సులభంగా అతి తక్కువ సమయంలో దీనిని చేసుకోవచ్చు. కానీ చాలా మందికి ఈ కోడిగుడ్డు షేర్వా ఎలా చేసుకోవాలో తెలియదు. అందుకే ఈ స్టోరీలో కోడిగుడ్డు షేర్వా ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం.
ఎగ్ షేర్వా తయారీకి కావాల్సిన పదార్థాలు
కోడిగుడ్లు - 4
కొత్తిమీర తరుగు - 4 స్పూన్లు
లవంగాలు - 4
యాలకులు - 3
దాల్చిన చెక్క - చిన్న ముక్క
జీడిపప్పులు - గుప్పెడు
ఎండు కొబ్బరి పొడి - 2 స్పూన్లు
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 4
సోంపు గింజలు - ½ స్పూను
నీళ్లు - తగినన్ని
పుదీనా - ½ కప్పు
కరివేపాకులు - గుప్పెడు
పసుపు - ½ స్పూను
కారం - 2 స్పూన్లు
ధనియాల పొడి - 1 స్పూను
బిర్యానీ ఆకు - 1
టమాటో - 3
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 స్పూను
ఉప్పు - రుచికి సరిపడా

ఎగ్ షేర్వా తయారీ విధానం
మొదటగా ఒక మిక్సీలో కొత్తిమీర తరుగు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీడిపప్పులు, ఎండు కొబ్బరి పొడిని వేసి వాటిని మెత్తగా రుబ్బాలి. ఈ మసాలా పేస్టు పూర్తిగా తయారయ్యాక పక్కన పెట్టుకోవాలి.
ఇక, టమాటో ముక్కలను మిక్సీలో వేసి వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి, పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి వేడి చేయాలి. వేడి అయిన నూనెలో బిర్యానీ ఆకు, సోంపు గింజలు వేసి వేయించుకోవాలి.
ఆ తర్వాత, సన్నగా తరిగిన ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చిని వేసి బాగా వేయించాలి. ఇవి వేయించుకుంటూ, వాటి వాసన పోయి బంగారు రంగు తీసుకునేంతవరకు వేయించాలి.
ప్రతిరోజూ ఒక్క గ్లాస్ ఈ గంజి తాగితే.. నెలలో 4 కిలో బరువు తగ్గుతారు.. ఎలా చేసుకోవాలంటే?
తరువాత, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకొని, కరివేపాకు కూడా వేసి, వాటి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత, టమాటో పేస్టును వేయించి, మంచి మిక్స్ చేయాలి. టమాటో మిశ్రమం సగం వేగే వరకు ఉంచి, దానిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న మంట మీద పది నిమిషాలపాటు ఉడికించాలి.
టమాటో మిశ్రమం నుంచి నూనె పైకి తేలిపోతుంది, అప్పుడు కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి బాగా కలపాలి.
తర్వాత, 2 గ్లాసుల నీరు కూడా వేసి, మంచి మిక్స్ చేసి, మూత పెట్టి ఉడికించాలి.
గుడ్లను ముందుగానే ఉడికించి, వాటి పొట్టు తీసి గాట్లు చేసి, పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు, ఉడికిన పులుసులో గుడ్లను వేసి, బాగా కలుపుకోవాలి.
చివరగా, కొత్తిమీర తరుగు మరియు కస్తూరి మేతి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, రుచికరమైన ఎగ్ షేర్వా రెడీ!
ఈ ఎగ్ షేర్వాను వేడిగా అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే, రొటీ, చపాతీ లేదా ఇడ్లీ, దోశతో కూడా ఎంతో బాగుంటుంది. ఈ వంటకం కేవలం రుచికరంగా మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో వాడిన పదార్థాలు, ముఖ్యంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సోంపు, కొత్తిమీర, ధనియాలు వంటి సూత్రాలు, మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications