Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
కమ్మని గోంగూర పులిహోర..! తెల్ల గోంగూరతో చేస్తే ఆ టేస్టే వేరబ్బా..!
పులిహోరలో గోంగూర పులిహోర వేరయా అని చెప్పవచ్చు. గోంగూరతో ఏది చేసినా అద్భుతమే. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, గోంగూర మటన్, ఇలా గోంగూరతో ఎన్నో వెరైటీ రెసిపీలు వున్నాయ్. గోంగూర పులిహోర ఎలా వుంటుందో ఎప్పుడైనా టేస్ట్ చూశారా? మీకోసం గోంగూర రెసిపీని మీ ముందుకు తీసుకొని వచ్చాం.
గోంగూర పులిహోర తయారు చేయడానికి కావాల్సిన వంట సామాగ్రి
బియ్యం, మంచినూనె, ఉప్పు, గోంగూర ఆకులు, మినపప్పు, మిరియాలు, జిలకర, ఎండిమిరపకాయలు, ధనియాలు, పల్లీలు, చెనగపప్పు, ఆవాలు, ఎండిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకులు.

గోంగూర పులిహోర తయారు చేసే విధానం
కుక్కర్‌లోకి పావుకిలో బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యాన్ని బాగా కడిగిన తరువాత బియ్యంలో ఒకటిన్నర్ గ్లాసు నీళ్లను పోసుకోవాలి. అన్నం త్వరగా ఉడకడానికి రెండు టీ స్పూన్ల మంచి నూనెను, అర టీస్పూన్ ఉప్పును యాడ్ చేసుకోవాలి. కుక్కర్‌కు మూత పెట్టి స్టవ్‌పైన పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్‌ను స్టవ్‌పైనే పెట్టాలి. అన్నం ఉడికిన తరువాత ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అన్నం చల్లారేంత వరకు అన్నాన్ని బౌల్‌లో అలాగే పెట్టుకోవాలి.
మూడు కప్పుల గోంగూర ఆకులను వలిచి తీసుకోవాలి. గోంగూరను బాగా కడగాలి. స్టవ్‌పై ఒక ప్యాన్‌ను పెట్టుకొని పావు టీస్పూన్ మెంతులను యాడ్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ చెనగపప్పును, ఒక టీ స్పూన్ మినపప్పును, అరటీస్పూన్ మిరియాలను, అరటీస్పూన్ జిలకరను, 4 ఎండిమిరపకాయలను, ఒక టీస్పూన్ ధనియాలను కూడా తీసుకొని ప్యాన్‌లో ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అవడానికి ఒక టీస్పూన్ మంచి నూనెను కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసిన మొత్తాన్ని మిక్సీ గ్రైండర్‌లోకి తీసుకోవాలి.

ఇప్పుడు ఒక ప్యాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ మంచి నూనెను తీసుకోవాలి. ఇంతకు ముందు కడిగి పెట్టుకున్న రెండు కప్పుల గోంగూర ఆకులను ప్యాన్‌లో వేసుకోవాలి. ఇలా గోంగూరను కలుపుతూ వుంటే గోంగూరలో వున్న నీళ్లన్నీ ప్యాన్‌లో ఊరుతుంటాయ్. ప్యాన్‌లో గోంగూర ఆకులు మొత్తం మాడిపోకుండా వుండాలంటే రెండు టీ స్పూన్ల నీళ్లను పోసుకోవాలి. 3, 4 నిమిశాల వరకు గోంగూరను ఇలాగే ఫ్రై చేసుకుంటూ వుండాలి.
ఇంతకు ముందు గ్రైండర్‌లోకి తీసుకున్న వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని అన్నంలోకి తీసుకోవాలి. మిక్సీ గ్రైండర్‌లోకి గోంగూర ఆకులను యాడ్ చేసుకోవాలి. నానబెట్టిన 2,3 చింతపండు రేకలను కూడా యాడ్ చేసుకోవాలి.
స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి 2,3 టేబుల్ స్పూన్ల మంచి నూనెను యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయిన తరువాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా వేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తరువాత ఒక టీ స్పూన్ చెనగపప్పును, ఒక టీ స్పూన్ మినపప్పును తీసుకొని ఫ్రై చేయాలి. అరటీస్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. రెండు ఎండి మిరపకాయలను, నాలుగు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని కరివేపాకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ప్యాన్ పై ఫ్రై అవుతున్న దాంట్లో చిటికెటు పసుపును, గ్రైండ్ చేసుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పోప్‌ను అన్నంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక దీంతో గోంగూర పులిహోర రెడీ అయినట్టే. రుచికోసం కావాలంటే సగం నిమ్మకాయ చెక్కను ఈ గోంగూర పెలిహోరలో కలుపుకోవచ్చు. కేవలం పులిహోర అలాగే తినకుండా ఏదైనా పచ్చడితో నంచుకొని తినవచ్చు.
గోంగూరలో ఎన్నో పోషకాలు
గోంగూరలో పోషకాలు మెండుగా వుంటాయ్. ఇందులో వైటమిన్ సితో పాటు వైటమిన్, ఏ, వైటమిన్, బి1, వైటమిన్ బి2, వైటమిన్ బి9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, రైబోఫ్లోవిన్, కెరోటిన్‌లు వున్నాయ్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications