Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఘాటైన మటన్ దాల్ ఘోస్ట్.. ఇలా చేసుకుంటే రుచి అమోఘం! ఎలా చేసుకోవాలంటే?
ఆరోగ్యంతో పాటు రుచిలో ఏమాత్రం తీసిపోని రెసిపీల్లో మటన్ దాల్ ఘోస్ట్ కూడా ఒకటి. మసాలా దినుసులు, పప్పు కలిపి దీనిని తయారు చేస్తారు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే దీనిని చలికాలంలో తినడం వల్ల సీజన్ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా వెంటనే దూరమైపోతాయి. అంతటి ప్రయోజనాలతో పాటు ఎంతో రుచికరంగా ఉండే ఈ మటన్ దాల్ ఘోస్ట్ ఎలా చేసుకోవాలి? దానికి పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మటన్ దాల్ ఘోస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
బోన్‌లెస్ మటన్
కందిపప్పు
కారం
రుచికి సరిపడా ఉప్పు
పసుపు
పచ్చిమిర్చి
నూనె
ఉల్లిపాయలు
అల్లం వెల్లుల్లి పేస్ట్
జీలకర్ర పొడి
ధనియాల పొడి
గరం మసాలా
నిమ్మరసం
కొత్తిమీర
కరివేపాకు
మటన్ దాల్ ఘోస్ట్ తయారీ విధానం
ఈ మటన్ దాల్ ఘోస్ట్ తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. అందులో మనం తీసుకున్న బోన్‌లెస్ మటన్, పప్పు, కొద్దిగా నూనె, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 10 నుంచి 12 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఆ తరువాత ఆ మటన్, పప్పును పక్కన పెట్టేసి చల్లారేవరకు అలానే ఉంచుకోవాలి.
ఇప్పుడు ఒక పాన్ తీసుకోవాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వాటి రంగు మారేంత వరకు వాటిని వేయించుకోవాలి. ఆ తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తరువాత అందులోనే కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని.. మనం ముందుగా వేసుకున్న ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి.
అవి బాగా వేగిన తరువాత ముందుగా మనం ఉడికించి చల్లార్చుకున్న మటన్, పప్పును అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆ పప్పు, మటన్ మొత్తం మసాలాకు సరిగ్గా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అనంతరం ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలాక నిమ్మరసం, కొత్తిమీర వేసుకొని చల్లుకొని కిందకు దించుకుంటే మటన్ దాల్ ఘోస్ట్ సిద్ధమైనట్లే. దీనిని వేడి వేడి అన్నం, చపాతీతో తిన్నా ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications