Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లల్లో తెలివితేటలు పెంచే లడ్డూ..ఇంట్లొనే ఈజీగా ఇలా చేసుకోండి
పిల్లలు అయినా లేదా పెద్దలైనా సరైన పోషకాలు అందక ఒళ్లు నొప్పులతో బాధపడుతూ ఉంటే డ్రై ఫ్రూట్స్ లడ్డూని(Dry fruits laddu) రోజూ ఒకటి తింటే చాలామంచిది. ఈ లడ్డూ తింటే పిల్లల్లో తెలివితేటలు పెరుగుతాయని కొందరు నిపుణులు చెబుతుంటారు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటి ద్వారా కావాల్సిన పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించే డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
డ్రై ఫ్రూట్స్ లడ్డూ తయారీకి కావాల్సిన
పదార్థాలు
-కర్జూరం
-జీడిపప్పు
-బాదంపప్పు
-గుమ్మడి గింజలు
-పుచ్చ గింజలు
-గసగసాలు
-ఎండుకొబ్బరి తురుము
-నెయ్యి
-పిస్తా
-ఎండుద్రాక్ష
-యాలకల పొడి

డ్రై ఫ్రూట్స్ లడ్డూ తయారీ విధానం
-ముందుగా అరకప్పు బాదంపప్పు(75 గ్రాములు),అరకప్పు జీడికప్పు,అరకప్పు ఎండుద్రాక్ష,అరకప్పు పిస్తాలను ముక్కలుగా కట్ చేసి ఓ ప్లేట్ లో పెట్టుకోండి
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి పోసి కట్ చేసిన బాదంపప్పు ఇందులో వేసి 2 నిమిషాలు ఫ్రై చేయండి.
-తర్వాత అందులోనే కట్ చేసిన జీడిపప్పు ముక్కలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి.
-తర్వాత అందులోనే కట్ చేసిన పిస్తా,ఎండు ద్రాక్షాలు,50 గ్రాముల పుచ్చ గింజలు,30 గ్రాముల గుమ్మడి గింజలు వేసి మంటను మీడియం ప్లేమ్ లో పెట్టి కలుపుతూ 2-3 నిమిషాలు ఫ్రై చేయండి.
-కొంచెం ఫ్రై అయ్యాక అందులో అరకప్పు ఎండుకొబ్బరి తురుముని వేసి 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి.
-తర్వాత 1 టేబుల్ స్పూన్ గసగసాలను అందులో వేసి ఒక నిమిషం పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసి పాన్ లోని మొత్తాన్ని ఓ ప్లేట్ లోకి తీసుకోండి.
-ఇప్పుడు గింజలు తీసేసిన పావు కేజీ కర్జూరాన్ని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా స్మూత్ గా అయ్యేలా గ్రైండ్ చేయండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది వేడెక్కిన తర్వాత గ్రైండ్ చేసిన కర్జూరం పేస్ట్ ని ఇందులో వేసి మంటను లో ప్లేమ్ మీద పెట్టి 2-3 నిమిషాలు ఫ్రై చేయండి.
-ఖర్జూరం పళ్ల పేస్ట్ కొంచెం సాఫ్ట్ గా అయిన తర్వాత ఇందులో ముందుగా ప్లేట్ లో పక్కన ఉంచిన వేయించిన డ్రై ఫ్రూట్ మొత్తాన్ని వేసి కలపి స్టవ్ ఆపేసి పాన్ ని పక్కనపెట్టుకోండి.
-అదంతా పూర్తిగా చల్లారిన తర్వాత అందులో అర టీ స్పూన్ యాలకల పొడి వేసి అంతా కలిసేలా చేతిలో కలపండి.
-తర్వాత దాన్ని ఉండలుగా లడ్డూలుగా చుట్టండి. అంతే టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డూ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications