Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పాల పౌడర్,చక్కెర వాడకుండానే రుచికరమైన కుల్ఫీ.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి,మండే ఎండల్లో చల్ల చల్లగా
ఎండాకాలం వస్తే పిల్లలను ఐస్ క్రీమ్ తినకుండా ఆపలేం. పెద్దలకు కూడా ఐస్ క్రీమ్ పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. పాల పౌడర్, చక్కెర వాడకుండా ఇంట్లో అందుబాటులో ఉన్నవాటితోనే హెల్దీ కుల్ఫీ తయారుచేసుకోవచ్చు. పాల పౌడర్,చక్కెర వాడకుండా రుచికరమైన కుల్ఫీని ఇంట్లోనే ఈజీగా తయారుచేయడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కుల్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు
-జీడిపప్పు
-కుంకుమ పువ్వు
-వేడి నీళ్లు
-పాలు
-యాలకల పొడి
-ఐస్ క్రీమ్ పుల్ల
-బెల్లం తరుము
-పిస్తా పప్పు
-బాదం పప్పు

కుల్ఫీ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో 20 జీడిపప్పులు వేసి అవి మునిగేంత వేడినీళ్లు పోసి కొద్దిసేపు పక్కనపెట్టుకోండి
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే పాన్ పెట్టి అందులో 1 లీటరు పాలు పోసి బాగా మరిగించాలి. మధ్య మధ్యలో కలుపుతూ అవి అరలీటరు అయ్యే వరకు మరిగించాలి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేడినీళ్లలో నానబెట్టిన జీడిపప్పు వేసి నానబెట్టిన నీళ్లను కూడా పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-మరుగుతున్న పాలలో గ్రైండ్ చేసిన మిశ్రామాన్ని వేసి కలపాలి.
-ఇప్పుడు ఓ చిన్న బౌల్ లో చిటికెడు కుంకుమ పువ్వు,కొద్దిగా వేడినీళ్లు పోసి 5 నిమిషాలు పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు ఆ నానబెట్టిన కుంకుమ పువ్వుని నీటితో సహా మరిగించిన పాలలో వేసి కలపాలి.
-పాలలోనే అర టీస్పూన్ యాలకల పొడి వేసి కలపండి.
-పాలు రంగు మారి దగ్గరపడిన తర్వాత దానిని స్టవ్ మీదనుంచి తీసి పక్కనపెట్టుకోవాలి.
-కొంచెం చల్లారిన తర్వాత ఈ పాల మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలో వేసి అందులో అరకప్పు బెల్లం తరుము వేసి మొత్తగా గ్రైండ్ చేసి ఈ మిశ్రమాన్ని చిన్న స్టీల్ గాసులలోకి పోయండి. వాటి మీద పిస్తా తరుగు,బాదం తరుగు చల్లుకోండి.
-ఇప్పుడు బటర్ పేపర్ కి మధ్యలో ఐస్ క్రీమ్ పుల్లతో హోల్ చేసి దానిని పుల్లతో సహా ఆ గ్లాసుమీద పెట్టంది.
-దీనిని ఒక రోజంతా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి.
-తర్వాత బయటకు తీసి గ్లాసు మీద బటర్ పేపర్ తీసేయాలి. గ్లాసులోని రెండు చేతుల మధ్య పెట్టి రబ్ చేస్తే కుల్ఫీ బయటకు వచ్చేస్తుంది. షాపులలో దొరికే కుల్పీల టేస్ట్ కన్నా అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications