Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
దోశ, బోండా,ఇడ్లీ వద్దు..పొద్దున్నే ఈ మిల్లెట్ సూప్ తాగితే అనంతమైన శక్తి,ఎలా చేయాలో చూడండి
సాధారణంగా మన తెలుగోళ్లు పొద్దున్నే అల్పాహారంలోకి ఎక్కువగా ఇడ్లీ,దోశ,బోండా,పూరీ వంటివి తింటుంటారు. చాలా చోట్ల దాదాపుగా వీటినే బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారు. అయితే వీటికి బదులుగా రాగి సూప్ ఓ కప్పు తాగితే జీవితంలో హాస్పిటల్ వెళ్లే పని ఉండదు. రాగి సూప్ ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకం, ఇది రాగి పిండితో తయారు చేయబడుతుంది. రాగిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రాగి సూప్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
రాగి సూప్ తయారీకి కావలసిన పదార్థాలు
రాగి పిండి - 2 స్పూన్లు
అల్లం - 1/2 అంగుళం
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర - కొద్దిగా
నీరు - 2 కప్పులు
ఉల్లిపాయ - 1 చిన్నది
బీన్స్ - కొన్ని
పచ్చిమిర్చి - 1
టమోటా - 1 చిన్నది
క్యారెట్ - 1 చిన్నది

రాగి సూప్ తయారీ విధానం
-రాగి సూప్ తయారు చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలో రాగి పిండి, నీరు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి.
-తర్వాత ఒక పాన్ లో ఆయిల్ వేసి వేడి చేశాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక టమోటా, క్యారెట్, బీన్స్ వేసి కొన్ని నిమిషాలు వేయించాలి.
-తర్వాత అందులో రాగి పిండి మిశ్రమం, ఉప్పు వేసి బాగా కలపాలి.
-సూప్ చిక్కబడే వరకు తక్కువ మంట మీద ఉడికించాలి.
-తర్వాత అందులో కొత్తిమీర వేసి కలపి స్టవ్ ఆఫ్ చేసేస్తే రాగి సూప్ రెడీ. రాగి సూప్ ను ఉదయం లేదా సాయంత్రం తీసుకోవచ్చు.
తెలుగువాళ్లు తప్పక తినాల్సిన పచ్చడి ఇదే,ఎలా చేయాలంటే
రాగి సూప్ ఆరోగ్య ప్రయోజనాలు
రాగి సులభంగా జీర్ణమవుతుంది, కడుపు సమస్యలను కలిగించదు. ఇది శరీరానికి
శక్తిని అందిస్తుంది. రాగిలో విటమిన్స్లుమినరల్స్ పుష్కలంగా ఉంటాయి,
ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది..బరువు తగ్గడానికి
సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది ఎముకలు, దంతాల
ఆరోగ్యానికి మంచిది. ఇది రక్తహీనతను నివారించడానికి, జీర్ణక్రియను
మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
మధుమేహాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. రాగిలో తక్కువ గ్లైసెమిక్
సూచిక ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి
సహాయపడుతుంది. ఇది చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి మంచిది.
రాగి సూప్ ను వివిధ రకాలుగా తయారు చేయవచ్చు
వెజిటబుల్ రాగి సూప్: వివిధ రకాల కూరగాయలు వేసి తయారు చేస్తారు.
రాగి మాల్ట్ సూప్: రాగి మాల్ట్ వేసి తయారు చేస్తారు.
చికెన్ రాగి సూప్: చికెన్ వేసి తయారు చేస్తారు.
గుడ్డు రాగి సూప్: గుడ్డు వేసి తయారు చేస్తారు.
పాలకూర రాగి సూప్: పాలకూర వేసి తయారు చేస్తారు.
టమాటో రాగి సూప్: టమాటో వేసి తయారు చేస్తారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications