Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
హోలీ రోజు కచ్చితంగా తినాల్సిన ఫుడ్ ఇది, టేస్ట్ అదిరిపోద్ది, ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలంటే?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హోలీ అయితే వచ్చేసింది. దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు మొదలయ్యాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఈ హోలీ వేడుకల్లో పాల్గొని సందడిగా గడుపుతూ పండగను ఎంజాయ్ చేస్తుంటారు. సంవత్సరానికి ఒక్కసారి వస్తున్న పండగ కావడంతో అంతా రంగుల ప్రపంచంలో తేలనున్నారు. హోళిరోజు కేవలం వేడుకలు జరుపుకోవడం మాత్రమే కాదు.. కొన్ని రకాల ప్రత్యేకమైన వంటకాలను కూడా చేసుకుంటారు. అందులో ఒకటి కజ్జికాయలు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కజ్జికాయలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ఈ కజ్జికాయలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ కజ్జి కాయలను ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:
మైదా పిండి: 2 కప్పులు
నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: చిటికెడు
నీరు: తగినంత
నూనె: డీప్ ఫ్రై చేయడానికి
స్టఫింగ్ కోసం:
కొబ్బరి తురుము: 1 కప్పు
పంచదార: 1 కప్పు
యాలకుల పొడి: 1 టీ స్పూన్
జీడిపప్పు, కిస్మిస్: కొద్దిగా (అవసరమైతే)
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, నెయ్యి, ఉప్పు వేసి బాగా
కలపాలి.
తర్వాత కొద్దికొద్దిగా నీరు పోస్తూ చపాతీ పిండిలా మెత్తగా కలపాలి.
పిండిని తడి గుడ్డ కప్పి 30 నిమిషాలు నాననివ్వాలి.
స్టఫింగ్ కోసం ఒక పాన్ లో కొబ్బరి తురుము, పంచదార వేసి పంచదార కరిగే
వరకు వేయించాలి.
తర్వాత యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్ వేసి కలపాలి.
పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీలా ఒత్తుకోవాలి.
ఒత్తిన చపాతీ మధ్యలో కొబ్బరి మిశ్రమం పెట్టి అంచులు మూసి కజ్జికాయలా
తయారుచేసుకోవాలి.
ఒక కడాయిలో నూనె వేడి చేసి కజ్జికాయలను బంగారు రంగు వచ్చేవరకు
వేయించాలి.
వేడి వేడి కజ్జికాయలు తినడానికి సిద్ధం.
ఆరోగ్య ప్రయోజనాలు:
కొబ్బరిలో పీచు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
జీడిపప్పు, కిస్మిస్ లో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఇ ఉంటాయి.
చిట్కాలు:
పిండిని బాగా కలిపితే కజ్జికాయలు మెత్తగా వస్తాయి.
స్టఫింగ్ ను మరీ ఎక్కువగా పెట్టకూడదు, లేదంటే కజ్జికాయలు
వేయించేటప్పుడు పగిలిపోతాయి.
నూనె బాగా వేడిగా ఉంటే కజ్జికాయలు త్వరగా వేగుతాయి.
కజ్జికాయలను తక్కువ మంట మీద వేయిస్తే లోపల కూడా బాగా ఉడుకుతాయి.
కజ్జికాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే గాలి చొరబడని డబ్బాలో వేసి
నిల్వ చేయాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications