Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి
మన తెలుగువాళ్ల ఇళ్లల్లో లేదా హోటల్స్ లో ఉదయాన్నే తినడానికి దొరికే బ్రేక్ ఫాస్ట్ ఐటమ్ దోశ. దోశ రుచి చూడని తెలుగువారు ఉండరంటే ఆశ్చర్చపోనక్కర్లేదు. మన ఇళ్లల్లో ఎక్కువగా రెగ్యులర్ గా చేసే బ్రేక్ ఫాస్ట్ ఇదే. అయితే హోటల్ లో తినే దోశ రుచి, మన ఇంట్లో చేసుకునే దోశ రుచి చాలా భిన్నం ఉంటుంది. హోటల్ దోశ మాదిరి ఇంట్లో ఎందుకు టేస్ట్ రావడం లేదు అని చాలామంది ఆలోచిస్తుంటారు.
అయితే సీక్రెట్ అంతా దోశ పిండి రెడీ చేసే విధానంలోనే ఉంది. పిండి తయారుచేయడానికి వాడే పదార్థాలు ఒకటే, కానీ దాన్ని తయారుచేసుకునే విధానంలోనే అసలైన సీక్రెట్ దాగి ఉంటది. హోటల్ స్టైల్ లో దోశలు మీ ఇంట్లో రావాలంటే దోశ పిండి ఎలా రెడీ చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-మెంతులు
-పచ్చి శెనగపప్పు
-మినపప్పు
-మెంతులు
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా..
హోటల్ స్టైల్ దోశ పిండి తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో 3 కప్పుల బియ్యం వేసి ఇందులో కూడా నీళ్లు పోసి 12 గంటలు నానబెట్టుకోండి.
-మరో గిన్నెలో 1 కప్పు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు వేసి మొత్తం కలిసేలా చేత్తో కలుపుకోండి. తర్వాత ఇందులో నీళ్లు పోసి 12 గంటలు నానబెట్టుకోండి.
-12 గంటల పాటు నానిన తర్వాత బియ్యం, మినపప్పు మిశ్రమాన్ని ఒకసారి నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి.
-తర్వాత గ్రైండర్ లేదా మిక్సీ జార్ లో ముందుగా అందులో మినపప్పు మిశ్రమం వేయండి. తర్వాత అందులో నానబెట్టిన బియ్యం వేసి గ్రైండ్ చేసుకోండి. ఎక్కువ నీళ్లు పోయకండి. బరక అనేది లేకుండా పిండి జారుగా, స్మూత్ గా ఉండాలి.
గ్రైండ్ చేసిన పిండిన ఒక గిన్నెలోకి తీసుకోండి. అయితే వెంటనే దోశలు వేస్తే రావు. కాబట్టి ఒకసారి పిండిని స్పూన్ తో కలిపి మూతపెట్టి 12 గంటల పాటు పిండిని పులియబెట్టండి. అంటే దీనికోసం మీరు ఏం చేయనక్కర్లేదు. 12 గంటల పాటు మూతపెట్టి పిండిని వదిలేస్తే చాలు.
-12 గంటల తర్వాత పిండిని ఒకసారి కలుపుకుకోండి.
-తర్వాత స్టవ్ మీద పెన్ పెట్టి వేడయ్యాక పిండితో దోశ పోసుకోండి. అంతే ఇప్పుడు హోటల్ స్టైల్ లో మాదిరిగి దోశలు మీ ఇంట్లోనే ఉంటాయి. కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీతో దీన్ని తింటుంటే మస్త్ మజా వస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
