Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముందురోజు నానబెట్టకుండానే పది నిమిషాల్లోనే ఇన్‌స్టంట్ వడలు ఎలా చేసుకోవాలో తెలుసా?
వడలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ వాటిని చేయాలంటే చాలా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ముందురోజే మినపప్పును నానబెట్టడం, పిండి పట్టుకోవడం, మారినేషన్ చేసుకోవడం వంటి పనులు చాలానే ఉంటాయి. కానీ మన ఉరుకుల పరుగుల జీవితంలో అవి అస్సలు సాధ్యం కావు. అందుకే ఎప్పుడో సెలవులప్పుడో లేదా ఇంటికి వెళ్ళినప్పుడో వడలు చేసుకుంటూ ఉంటాము. అయితే అలా కాకుండా కేవలం క్షణాల్లోనే ఇన్‌స్టంట్‌గా వడలు చేసుకొని తినేయొచ్చు. అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఈ ఇన్‌స్టంట్ వడల తయారీకి కావాల్సిన పదార్థాలు
ఒక కప్పు మినపప్పు
రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి
పావు కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు
రెండు తరిగిన పచ్చిమిర్చి
ఒక టీస్పూన్ అల్లం పేస్ట్
సన్నగా తురిమిన కరివేపాకు
రుచికి సరిపడా ఉప్పు
డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె
పిండి కలుపుకోవడానికి సరిపడా నీళ్లు
ఇన్‌స్టంట్ వడ తయారీ విధానం
ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో మినపప్పు, బియ్యం పిండి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం పేస్ట్, కరివేపాకులు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా నీరు కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. మరీ వదులుగా, మరీ గట్టిగా లేకుండా పిండిని కలుపుకొని ఒక పదినిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
ఈ పది నిమిషాల లోపు స్టవ్ ఆన్ చేసి.. కడాయి పెట్టి వడలు ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక.. గిన్నెలో కలుపుకొని పెట్టుకున్న పిండిని వడల మాదిరిగా చేసుకోవాలి. అందుకోసం కొంచెం పిండి తీసుకొని గుండ్రంగా చేసుకొని.. మధ్యలో హోల్ చేసుకోవాలి.
ఇప్పుడు బాగా వేడెక్కిన నూనెలో వడలను మెల్లిగా వదలాలి. ఆ వడలు బంగారు రంగులోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి. బంగారు రంగులోకి వచ్చేంత వరకు అటూ ఇటూ తిప్పుతూ బాగా కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన వడను ఓ ప్లేట్‌లో టిష్యూ పేపర్‌పై పెట్టుకోవాలి. ఇలా మిగిలిన వదలన్నిటినీ చేసుకోవాలి.
ఆ తరువాత ఆ వడలను సాంబార్ లేదా పల్లి చట్నీ, కుదిరితే కొబ్బరి చట్నీతో తింటే రుచి అమోఘంగా ఉంటుంది. అలాగే మీకు ఇష్టమైన వడలను కూడా ఇంట్లోనే పది నిమిషాల్లోనే చేసుకొని తిన్నట్లు అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఓసారి ట్రై చేయండి మరి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications