Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Khichidi kheemaa khatta: ప్రపంచంలో ఎక్కడా దొరకని బ్రేక్ ఫాస్ట్ ఇది.. తింటే స్వర్గమే, ఎలా చేసుకోవాలంటే?
మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల బ్రేక్ ఫాస్ట్‌లు టిఫిన్‌లు తిని ఉంటారు. కానీ ఎప్పుడైనా హైదరాబాద్ సాంప్రదాయక వంటకమైన, హైదరాబాద్‌లోనే దొరికే ఖిచిడీ ఖీమా ఖట్ట తిన్నారా? దీని రుచి మాటల్లో వర్ణించలేము. తెల్లవారు జామున 4 గంటలకు లేచి మరీ దీనిని తినడానికి లైన్లో నిలబడే వారు చాలా మంది ఉంటారు. అయితే ఈ రోజు ఈ ఖిచిడీ ఖీమా ఖట్టను ఎలా చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం.
ఖిచిడీ కోసం కావలసినవి:
బియ్యం - 1 కప్పు
పెసర పప్పు - 1/2 కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1/2 టీస్పూన్
లవంగాలు - 2
యాలకులు - 2
దాల్చిన చెక్క - చిన్న ముక్క
నీరు - 3 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా

ఖీమా కోసం కావలసినవి:
మటన్ ఖీమా - 1/2 కిలో
ఉల్లిపాయ - 2 (పెద్దవి, తరిగినవి)
పచ్చిమిర్చి - 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు
టమాటా - 1
కారం పొడి - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్
గరం మసాలా - 1/2 టీస్పూన్
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా (తరిగినది)
ఖట్టా కోసం కావలసినవి:
చింతపండు - 1/2 కప్పు (పులుసు తీసినది)
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - కొద్దిగా
ఆవాలు - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్
ఎండుమిర్చి - 2
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
ఖిచిడీ తయారీ విధానం:
ఖిచిడీ తయారు చేయడానికి ముందుగా బియ్యం, పెసర పప్పును కడిగి, నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత కుక్కర్లో నెయ్యి వేడి చేసి అందులో జీలకర్ర, లవంగాలు, యాలకులు మరియు దాల్చిన చెక్క వేసి వేయించాలి. అనంతరం ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం వేయించాలి. తరువాత నానబెట్టిన బియ్యం మరియు పెసర పప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆపై నీరు మరియు ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి, రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
ఖీమా తయారీ విధానం
కుక్కర్లో నూనె వేడి చేసి, ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం వేయించాలి. ఇప్పుడు అందులో ఖీమా వేసుకోవాలి. ఆ ఖీమా రంగు మారే వరకు వేయించాలి. అనంతరం టమాటా, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి మరియు ఉప్పు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీరు వేసి కుక్కర్ మూత పెట్టి, రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఆ తరువాత గరం మసాలా మరియు కొత్తిమీర వేసి కలపాలి.
ఖట్టా తయారీ విధానం:
ఒక గిన్నెలో చింతపండు పులుసు, ఉప్పు మరియు నీరు వేసి కలపాలి. ఆ తరువాత పాన్లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసి వేయించాలి. అలాగే ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అనంతరం అందులో చింతపండు పులుసు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు ఉడికించి దించాలి. ఆ తరువాత ఖిచిడీ ఖీమా ఖట్టాను వేరు వేరుగా ఒకే ప్లేట్‌లో వడ్డించుకుంటే ఎంతో స్పెషల్ అయిన ఖిచిడీ ఖీమా ఖట్టా సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications