Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
స్వీట్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఈ స్వీట్ తప్పకుండా తినాల్సిందే, ఇంట్లోనే ఇలా సులభంగా చేసుకోవచ్చు!
స్వీట్స్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా దీనిని తింటూ ఉంటారు. స్వీట్స్ కనిపిస్తే చాలా ఎగబడి మరీ కొనుక్కొని తింటుంటారు. స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ తినేది మాత్రం కొబ్బరి పాయసం. దీనిని ఇంట్లోనే సులభంగా, చాలా తక్కువ పదార్థాలతో చేసుకోవచ్చు. అలాగే ఈ స్వీట్‌కి దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా, ఇంటికి వచ్చిన అతిథి నోరు తీపి చేయాలన్నా దీనిని వినియోగిస్తుంటారు. ఏ కాలంలో చేసుకొని తిన్నా ఈ కొబ్బరి పాయసం రెసిపీ మాత్రం అదిరిపోతుంది. దీనిని ఇంట్లోనే సులభమైన పద్దతిలో ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొబ్బరి పాయసం తయారీకి కావలసిన పదార్థాలు:
కొబ్బరి తురుము: 1 కప్పు
పాలు: 1 లీటరు
బియ్యం: 2 టేబుల్ స్పూన్లు
పంచదార: 1 కప్పు
నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు, కిస్‌మిస్: కొద్దిగా
యాలకుల పొడి: 1/2 టీస్పూను

కొబ్బరి పాయసం తయారీ విధానం:
బియ్యం కడిగి నీళ్ళు పోసి నానబెట్టండి.
కొబ్బరి తురుము, నానబెట్టిన బియ్యం కొద్దిగా నీళ్లు పోసి మిక్సీలో
మెత్తగా రుబ్బుకోవాలి.
స్టౌ మీద గిన్నె పెట్టి పాలు పోసి వేడి చేయండి.
పాలు మరుగుతుండగా రుబ్బుకున్న కొబ్బరి, బియ్యం మిశ్రమాన్ని వేసి
కలపాలి.
పాయసం చిక్కబడే వరకు సన్నని మంట మీద ఉడికించాలి.
పంచదార, యాలకుల పొడి వేసి పంచదార కరిగే వరకు కలపాలి.
చిన్న పాన్‌లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు,
కిస్‌మిస్ వేయించి పాయసంలో కలపాలి.
కొద్దిసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
వేడి వేడి కొబ్బరి పాయసం సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది.
కొబ్బరి పాయసం చేసేందుకు కొన్ని చిట్కాలు:
పాయసం మరింత రుచిగా ఉండాలంటే కొబ్బరి పాలు కూడా ఉపయోగించవచ్చు.
మీకు ఇష్టమైతే కుంకుమపువ్వు కూడా వేసుకోవచ్చు.
డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం ప్రకారం వేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications