ఇలా చేసుకుంటే ఎన్ని రోజులైనా నిమ్మకాయ పచ్చడి పాడవదు, అదే రుచి అదే టేస్ట్.. ఎలా అంటే?

మన తెలుగు ప్రజలకు అమ్మ అయినా.. అమ్మ చేసే పచ్చడి అయినా ఎంతో ఇష్టం. ఇంట్లో కూర ఏదీ లేనప్పుడు అమ్మ ముందుగానే చేసి ఉంచిన ఎదో ఒక పచ్చడిని తినేసి ఆకలిని తీర్చుకుంటాం. రుచికి రుచి ఆరోగ్యానికి అందించే తెలుగించి పచ్చళ్ళు చాలానే ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు పక్కనే మటన్ ముక్కలు ఉన్నా కూడా వాటిని కాదని చాలా మంది పచ్చళ్ళు వేసుకొని తింటూ ఉంటారు. అలాంటి పచ్చళ్ళు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటే ఈ నిమ్మకాయ పచ్చడి.

నిమ్మకాయ పచ్చడి సహజంగానే చాలా రుచికరంగా ఉంటాయి. దీనిని తినడం ద్వారా చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నిమ్మకాయ పచ్చడిలో అనేక రకాల పోషకాలు దాగి ఉంటాయి. ఇవి మెండుగా పోషకాలను శరీరానికి పంచి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే మారుతున్న జీవన విధానం, పట్టణీకరణ కారణంగా చాలా మందికి ఈ నిమ్మకాయ పచ్చడి ఎలా వేసుకోవాలో తెలియదు. అలాంటి వారి కోసమే ఈ స్టోరీలో నిమ్మకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? నిమ్మకాయ పచ్చడితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం.

నిమ్మకాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు..

నిమ్మకాయ ముక్కలు: 1 కిలో
ఆవపిండి: 150 గ్రాములు
కారం: 150 గ్రాములు
ఉప్పు: 100 గ్రాములు
మెంతులు: 25 గ్రాములు
నూనె: 250 మి.లీ
వెల్లుల్లి రెబ్బలు: 10
కరివేపాకు: కొద్దిగా

తయారీ విధానం:

నిమ్మకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా మంచి సైజు ఉన్న నిమ్మకాయలు ఎంచుకోవాలి. ఆ నిమ్మకాయలు ఇంటికి తీసుకొచ్చి.. వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాత వాటిని శుభ్రంగా తుడుచుకొని.. మంచి కత్తి తీసుకొని ఒకే సైజులో ఉండే విధంగా మంచి మంచి ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలన్నిటినీ.. ఒక తెల్ల బట్టపై పరిచి ఆరబెట్టుకోవాలి.

ఆ తరువాత ఒక గిన్నె తీసుకొని, ఆ గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వాటన్నిటినీ బాగా కలుపుకోవాలి. కారం ఉప్పు అంతా సరిగ్గా కలిసే విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి.

ఇప్పుడు ఒక కడాయి తీసుకొని.. అందులో పచ్చడికి సరిపడా నూనె పోసుకోవాలి. ఆ నూనెలో మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకోవాలి. వాటన్నిటినీ ఒక్కసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత ఆ నూనెను తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ముక్కల గిన్నె తీసుకొని అందులో ఆవపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ మిశ్రమం మొత్తం నిమ్మకాయ ముక్కలకు పట్టుకునే విధంగా బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం మొత్తం అన్ని ముక్కలకు పెట్టె విధంగా కలుపుకొని ఆ తరువాత రుచి చూసుకోవాలి. ఉప్పు కారం సరిగ్గా లేకపోతే కొంచెం కలుపుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆయిల్‌ను అందులో వేసుకొని కలుపుకోవాలి. ఆపై ఆ పచ్చడిని ఓ జాడీలో తీసుకొని మూత పెట్టిసి ఓ గుడ్డతో కట్టుకోవాలి. మూడు రోజుల పాటు వాటిని మగ్గనివ్వాలి. ఆ తరువాత ఆ పచ్చడిని తినేందుకు వినియోగించుకోవచ్చు.

నిమ్మకాయ పచ్చడి పెట్టేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:

నిమ్మకాయలు పుల్లగా ఉండాలి.
మసాలాలు తాజాగా ఉండాలి.
పచ్చడిని శుభ్రమైన జాడీలో నిల్వ చేసుకోవాలి.
పచ్చడిని ఎప్పుడూ పొడి చేతులతో తియ్యాలి.

నిమ్మకాయ పచ్చడి ఆరోగ్య ప్రయోజనాలు:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
విటమిన్ సి ని అందిస్తుంది.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, March 18, 2025, 17:56 [IST]
Desktop Bottom Promotion