Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఇలా చేసుకుంటే ఎన్ని రోజులైనా నిమ్మకాయ పచ్చడి పాడవదు, అదే రుచి అదే టేస్ట్.. ఎలా అంటే?
మన తెలుగు ప్రజలకు అమ్మ అయినా.. అమ్మ చేసే పచ్చడి అయినా ఎంతో ఇష్టం. ఇంట్లో కూర ఏదీ లేనప్పుడు అమ్మ ముందుగానే చేసి ఉంచిన ఎదో ఒక పచ్చడిని తినేసి ఆకలిని తీర్చుకుంటాం. రుచికి రుచి ఆరోగ్యానికి అందించే తెలుగించి పచ్చళ్ళు చాలానే ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు పక్కనే మటన్ ముక్కలు ఉన్నా కూడా వాటిని కాదని చాలా మంది పచ్చళ్ళు వేసుకొని తింటూ ఉంటారు. అలాంటి పచ్చళ్ళు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటే ఈ నిమ్మకాయ పచ్చడి.
నిమ్మకాయ పచ్చడి సహజంగానే చాలా రుచికరంగా ఉంటాయి. దీనిని తినడం ద్వారా చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నిమ్మకాయ పచ్చడిలో అనేక రకాల పోషకాలు దాగి ఉంటాయి. ఇవి మెండుగా పోషకాలను శరీరానికి పంచి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే మారుతున్న జీవన విధానం, పట్టణీకరణ కారణంగా చాలా మందికి ఈ నిమ్మకాయ పచ్చడి ఎలా వేసుకోవాలో తెలియదు. అలాంటి వారి కోసమే ఈ స్టోరీలో నిమ్మకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? నిమ్మకాయ పచ్చడితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం.

నిమ్మకాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు..
నిమ్మకాయ ముక్కలు: 1 కిలో
ఆవపిండి: 150 గ్రాములు
కారం: 150 గ్రాములు
ఉప్పు: 100 గ్రాములు
మెంతులు: 25 గ్రాములు
నూనె: 250 మి.లీ
వెల్లుల్లి రెబ్బలు: 10
కరివేపాకు: కొద్దిగా
తయారీ విధానం:
నిమ్మకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా మంచి సైజు ఉన్న నిమ్మకాయలు ఎంచుకోవాలి. ఆ నిమ్మకాయలు ఇంటికి తీసుకొచ్చి.. వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాత వాటిని శుభ్రంగా తుడుచుకొని.. మంచి కత్తి తీసుకొని ఒకే సైజులో ఉండే విధంగా మంచి మంచి ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలన్నిటినీ.. ఒక తెల్ల బట్టపై పరిచి ఆరబెట్టుకోవాలి.
ఆ తరువాత ఒక గిన్నె తీసుకొని, ఆ గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వాటన్నిటినీ బాగా కలుపుకోవాలి. కారం ఉప్పు అంతా సరిగ్గా కలిసే విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక కడాయి తీసుకొని.. అందులో పచ్చడికి సరిపడా నూనె పోసుకోవాలి. ఆ నూనెలో మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకోవాలి. వాటన్నిటినీ ఒక్కసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత ఆ నూనెను తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ముక్కల గిన్నె తీసుకొని అందులో ఆవపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ మిశ్రమం మొత్తం నిమ్మకాయ ముక్కలకు పట్టుకునే విధంగా బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం మొత్తం అన్ని ముక్కలకు పెట్టె విధంగా కలుపుకొని ఆ తరువాత రుచి చూసుకోవాలి. ఉప్పు కారం సరిగ్గా లేకపోతే కొంచెం కలుపుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆయిల్‌ను అందులో వేసుకొని కలుపుకోవాలి. ఆపై ఆ పచ్చడిని ఓ జాడీలో తీసుకొని మూత పెట్టిసి ఓ గుడ్డతో కట్టుకోవాలి. మూడు రోజుల పాటు వాటిని మగ్గనివ్వాలి. ఆ తరువాత ఆ పచ్చడిని తినేందుకు వినియోగించుకోవచ్చు.
నిమ్మకాయ పచ్చడి పెట్టేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:
నిమ్మకాయలు పుల్లగా ఉండాలి.
మసాలాలు తాజాగా ఉండాలి.
పచ్చడిని శుభ్రమైన జాడీలో నిల్వ చేసుకోవాలి.
పచ్చడిని ఎప్పుడూ పొడి చేతులతో తియ్యాలి.
నిమ్మకాయ పచ్చడి ఆరోగ్య ప్రయోజనాలు:
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
విటమిన్ సి ని అందిస్తుంది.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications