Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఇంట్లోనే మామిడి తాండ్ర.. చేయడం చాలా సింపుల్..కానీ 3 రోజులు ఆరబెట్టాలి..!
మామిడితాండ్ర అనగానే మనకు చిన్నప్పటి ఘ్నాపకాలు గుర్తుకు వస్తాయ్. తోపుడు బళ్లపై మామిడితాండ్ర వస్తుంటే పరిగెత్తుకూంటూ వెళ్లి 50 పైసలు, రూపాయికి మామిడి తాండ్రను కొనుక్కొని తినేవాళ్లం. ఇప్పుడు బేకరీల్లో డైరీమిల్క్ ప్యాక్ చేసినట్లు మామిడితాండ్రను ప్యాక్ చేసి అమ్ముతున్నారు. మామిడి తాండ్ర తినే విధానాన్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. మామిడి తాండ్రపై వుండే లేయర్స్‌ను ఒక్కొక్కటిగా తీసుకుంటూ తింటాము. మామిడి తాండ్రను తయారు చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. మామిడి తాండ్ర రెసిపీని మీ ముందుకు తీసుకొని వచ్చాము. ఈ వేసవి ముగిసిపోకముందే మామిడికాయలతో మామిడి తాండ్రను తయారు చేసుకుందాం.
మామిడి తాండ్రను తయారు చేయడానికి కావలసిన వంటసామాగ్రి
మూడు పచ్చి పుల్లటి మామిడికాయలు, చెక్కర, ఉప్పు, జిలకర పొడి, చాట్ మసాలా, గరం మసాలా, కారంపొడి, నల్ల ఉప్పు.
మామిడి తాండ్రను తయారు చేసే విధానం
మూడు పచ్చి పుల్లటి మామిడికాయలను పొడుగు ముక్కలుగా కోసుకొని, ఒక ప్యాన్‌లో వేసుకోవాలి. మామిడి కాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి ప్యాన్‌ను 10 నుంచి 15 నిమిశాల వరకు ఉడకబెట్టాలి. మామిడికాయ ముక్కలు బాగా ఉడికేలా చూసుకోవాలి. ఇలా ఉడికిన తరువాత గ్యాస్‌ను ఆఫ్ చేయాలి.
ఒక ప్యాన్‌లోకి మామిడికాయ ముక్కలను జెల్లడపట్టి తీసుకోవాలి. ఈ జెల్లడ నుంచి మామిడి గుజ్జు మొత్తం ప్యాన్‌లోకి వస్తుంది. మామిడి గుజ్జు మొత్తం ప్యాన్‌లో వచ్చేలా చూసుకోవాలి. ప్యాన్‌ను స్టవ్‌పై పెట్టి 5 నిమిశాల వరకు ఉడికించాలి. ఉడుకుతున్న మామిడిముక్కల్లో ముప్పావు కప్పు చెక్కరను యాడ్ చేసుకోవాలి.
ఇందులోనే చాట్ మసాలా, అర టీస్పూన్ ఉప్పును, పావు టీ స్పూన్ గరం మసాలా, అర టీస్పూన్ బ్లాక్ సాల్ట్, ఒక టీ స్పూన్ కారంపొడిని, వేయించిన అరటీస్పూన్ జిలకరపొడిని వేసి బాగా కలపాలి. ప్యాన్‌లో చిక్కగా అయ్యేంతవరకు ఉడికించాలి. పలుచగా వుంటే మామిడి తాండ్ర చేయడానికి వీలు పడదు.
ఒక ప్లేటుకు నెయ్యిని రాసి దాంట్లో ఈ మామిడి తాండ్ర చిక్కటి రసాన్ని యాడ్ చేసుకోవాలి. ప్లేట్‌ను తిప్పుతూ వుంటే ప్లేటు మొత్తం ఈ చిక్కటి మామిడి తాండ్ర స్ప్రెడ్ అవుతూ వుంటుంది. ప్లేటులో స్ప్రెడ్ అయిన ఈ మామిడి తాండ్రను ఎండలో 3 రోజుల వరకు ఎండబెట్టాలి.
మామిడి తాండ్రను ఎండబెట్టినప్పుడు దుమ్ము పడకుండా, కాకులు, పక్షులు తినకుండా వుండడానికి బట్టతో కప్పాలి. మూడు రోజుల తరువాత ఆ ప్లేటులోని మామిడి తాండ్రను స్పూన్ సాయంతో, లేదా కత్తిసాయంతో తీసి మామిడి తాండ్రను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక దీంతో మామిడి తాండ్ర రెడీ అయినట్టే. ఇంట్లోనే మామిడి తాండ్రను సింపుల్‌గా, ఈజీగా తయారు చేసుకోవచ్చు.
మామిడి తాండ్ర వల్ల రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మామిడి తాండ్రలో మామిడి వుండడం వల్ల వైటమిన్ సి పుష్కలంగా వుంటుంది. పావు కప్పు ఎండిపోయిన మామిడి తాండ్రలో 128 క్యాలరీలు వుంటాయ్. కార్బోహైడ్రేట్లు 31 గ్రాములు వుంటాయ్, ఫైబర్ 1 గ్రాము, చెక్కర 27 గ్రాములు, ప్రొటీన్ 1 గ్రాము వుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













