Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
ట్రెండింగ్ మామిడికాయ పచ్చడి..ఇది మాములు రుచి కాదండోయ్ అయోఘం,అద్భుతం..ఎలా చేసుకోవాలంటే
మామిడికాయతో రకరకాల వంటకాలు తయారుచేస్తుంటారు. అయితే పుల్లటి మామిడికాయలతో అప్పటికప్పుడు మిక్సీలో చేసే ఓ పచ్చడి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పుల్ల మామిడికాయలతో చేసే ఈ పచ్చడి టేస్ట్ యమా రుచిగా నెక్ట్ లెవల్లో ఉంటుంది. అన్నం లేదా మరే ఇతర టిఫిన్స్ లోకి అయినా ఇది సూపర్ కాంబినేషన్ గా ఉంటుంది. ఈ పచ్చడిలో ఉపయోగించే పదార్థాలన్నీ కూడా పోషక విలువలు కలిగినవే. ముఖ్యంగా దీనిని నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా సులువుగా చేసుకునే పచ్చడి ఇది. పచ్చి మామిడికాయతో టేస్టీ పచ్చడి తయారు చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
మామిడికాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
పుల్లటి మామిడికాయలు - 2
ఆవాలు - 2 టేబుల్ స్పూన్లు
మెంతులు - 1/2 టీ స్పూన్
ఎండు మిరపకాయలు - 8-10
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - 1/2 టీ స్పూన్
నూనె - 1/4 కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 5-6
కరివేపాకు - 1 రెమ్మ
ఆవాలు - 1 టీ స్పూన్
జీలకర్ర - 1/2 టీ స్పూన్
టమాటోలు-3

మామిడికాయ పచ్చడి తయారీ విధానం
ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ వేడి చెయ్యాలి. ఆయిల్ వేడయ్యాక అందులో రెండు పచ్చి మామిడికాయలను నాలుగు ముక్కలుగా వేయాలి. ఇందులోనే 6 ముక్కలుగా కట్ చేసిన 3 టమాటోల ను, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిరపకాయలను వేసి పాన్ మీద మూత పెట్టేసి ఉడకనివ్వాలి.
-మామిడికాయ, టమాటో ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.
తర్వాత మిక్సీ గిన్నెలో పైన తొక్క తీసిసి టమాటో, తొక్క తీసిసి మామిడి గుజ్జును, వెల్లుల్లి వేయాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కారం,ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
Ragi Chapati: పోషకమైన రాగి చపాతీలు..చాలా మెత్తగా సూపర్ టేస్టీగా ఉంటాయి..ఎలా చేసుకోవాలంటే
ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసి పక్కనపెట్టుకోండి.
ఇప్పుడు తాళింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేడి చేసి ఆవాలు,జీలకర్ర, ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించాలి. ఈ తాళింపుని ముందుగా రెడీ చేసిన మామిడికాయ పచ్చడిలో వేసి కలపండి. అంతే మామిడికాయ పచ్చడి రెడీ. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకుని తింటుంటే ఆ మజానే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications