Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
మ్యాంగో పరోటా ఆహా ఏమి రుచి..! మామిడి సీజన్ అయిపోయేలోపు ఇలా చేసుకుని తినాల్సిందే..!
Mango Parotta: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైందని అర్థం. ఫైబర్ మరియు విటమిన్లు సమృద్ధిగా ఉన్న మామిడిని పండ్లలో రారాజుగా పిలుస్తారు. మామిడిపండ్లు తీపి రుచిని కలిగి ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ మామిడి పండ్లను ఇష్టపడతారు. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఈ మామిడి పండును మితంగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు,
మామిడి పండ్లను మితంగా తింటే బరువు కూడా పెరగరు. ఇప్పుడు వేసవి ముగిసి వర్షాకాలం మొదలౌతుంది. ఈ సమయంలో మామిడి సలాడ్, మామిడి రసం, ఇతర కూరగాయలతో మామాడి కాయల పల్యం, మామిడి జామ్ వంటి రుచికరమైన స్నాక్స్ తినాలని మనకు అనిపిస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా మామిడితో చేసిన పరోటాను తిన్నారా?. ఆరోగ్యకరమైన, రుచికరమైన మ్యాంగో పరోటాలను ఎలా తయారు చేయాలో చూద్దాం.

మామిడి పరోటా సిద్ధం చేయడం సులభం. మీ నాలుక రిచికి సరిపోయే బ్రేక్ ఫాస్ట్ గా మ్యాంగో పరోటాలు చాలా చక్కగా, టేస్టీగా సరిపోతాయి. ప్రతిరోజు మీరు దోసెలు, చపాతీ, పూరీలు, ఇడ్లీలు, ఉప్మా, వడలు తింటూ విసిగిపోయి ఉంటే మామిడికాయతో పరోటా ఎలా చేసుకోవచ్చు అని తెలుసుకోండి. ముందుగా మామిడికాయను శుభ్రంగా కడిగి వాటిని ముక్కలుగా కోయండి. మామిడిపండు గుజ్జును మాత్రం తీసి దానిని మిక్సీలో బాగా గ్రైండ్ చేయండి. లేదా మామిడి పండు గుజ్జును చేతితో తీసి మెత్తగా అయ్యే వరకు దానికి కలపండి.
మ్యాంగో పరోటా తయారీకి కావలసిన పదార్థాలు
గోధుమ పిండి - 1 కప్పు
ఒక మామిడి పండు - దాని గుజ్జును మాత్రం తీసుకోండి
యాలకుల పొడి - 1/4 టీస్పూన్
మిరియాల పొడి - ¼ టీ స్పూన్
ఉప్పు - రుచికి కావలసినంత
నెయ్యి/నూనె - కావలసినంత
మ్యాంగో పరోటా ఎలా తయారు చేయాలి
- ముందుగా రెండు కప్పుల గోధుమపిండిని నీళ్లలో వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీనికి అరకప్పు మామిడికాయ గుజ్జు ను కలపండి. ఈ పిండిలో యాలకుల పొడి, కారం పొడి వేయాలి. కలిపిన పిండిని 15 నుంచి20 నిమిషాల పాటు వదిలివేయండి.
- ఇప్పుడు నిమ్మకాయ సైజులో చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. మీ చేతుల సహాయంతో బంతిలాగా దానిని చిన్న వృత్తంలోకి తిప్పండి.
- అప్పుడు దానిని మడవండి. మళ్లీ మెల్లగా బంతి ఆకారంలో పరోటా ఆకారంలో వాటిని రోల్ చేయండి. వీలైనంత సున్నితంగా వాటిని రుద్దండి.
- ఇప్పుడు తవాను స్టవ్ మీద ఉంచండి. తవా వేడెక్కుతున్నప్పుడు చుట్టిన పరోఠాను అందులో వేయండి. తర్వాత పరోటాను రెండు వైపులా బాగా కాల్చండి.
- పరోటా చేసేటప్పులు మీరు నెయ్యి కాని, నూనె కాని మీకు కావలసినంత వేయాలి. ఇప్పుడు సిద్ధంగా ఉన్న మ్యాంగో పరోటాను ఇంట్లో అందరికీ వడ్డించడి.
- ఒకసారి మ్యాంగో పరోటా తింటే మామిడి సీజన్ అయిపోయే వరకు మీరు ఇలాగే మ్యాంగో పరోటా చేసుకుని తింటారు.
మ్యాంగో పరోటాల తయారీకి కొన్ని చిట్కాలు
- పరోటాను తక్కువ మంట మీద కాల్చుకోవాలి. మీరు గ్యాస్ మంటను పెంచినట్లయితే అది పాన్ కు అంటుకోవచ్చు.
- అవసరమైతే పరోఠాలను ఎప్పటిలాగే తయారు చేసుకోవచ్చు. అప్పుడు పాన్ మధ్యలోకి తీసుకువచ్చి స్టఫ్డ్ పరోటా తయారు చేయడానికి సిద్ధం చేయవచ్చు.
- గోధుమ పిండిని పిసికి కలుపుతున్నప్పుడు ఎక్కువ నీరు కలపవద్దు. మామిడి గుజ్జులో ఉండే నీటిశాతం పిండి తయారీకి సరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications