Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇలాంటి పకోడీ మీరు జన్మలో టేస్ట్ చేసి ఉండరు.. రుచి వేరే లెవెల్, సింపుల్‌గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే?
పకోడీ అంటే శెనగ పిండితో చేసేదే ఎక్కువగా తింటూ ఉంటారు. మిర్చి పకోడీ, తమలపాకుల పకోడీ, ఉల్లి పకోడీ ఇలా నానారకాల పకోడీలు ఉంటాయి. కానీ మీరెప్పుడైనా మిల్ మేకర్ పకోడీ ఎప్పుడైనా తిన్నారా? మిల్ మేకర్ కూర తినాలంటేనే చాలా మందికి ఇష్టం ఉండదు. ఇంకా దానితో పకోడీ ఏంటి అని అనుకుంటున్నారా? కానీ మిల్ మేకర్‌తో చేసుకునే పకోడీ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. ఒక్కసారి దీన్ని తింటే దీని రుచి నషాళానికి ఎక్కాల్సిందే. దీనిని తయారుచేసుకోవడం కూడా చాలా సులభం. ఈజీ వేలో దీనిని మేకింగ్ చేసుకోవచ్చు. అయితే మిల్ మేకర్ కూర ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
మిల్ మేకర్ - 1 కప్పు
శనగపిండి - 1/2 కప్పు
బియ్యం పిండి - 1/4 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
కారం - 1 స్పూన్
గరం మసాలా - 1/2 స్పూన్
పసుపు - 1/4 స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయించడానికి
కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినది)
కరివేపాకు - కొద్దిగా
ఉల్లిపాయలు - 1 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)

తయారుచేసే విధానం:
ముందుగా మిల్ మేకర్లను వేడి నీటిలో 5-10 నిమిషాలు నానబెట్టండి.
తర్వాత నీరు లేకుండా గట్టిగా పిండి పక్కన పెట్టండి.
ఒక గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం,
గరం మసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.
ఇప్పుడు మిల్ మేకర్లను ఈ పిండి మిశ్రమంలో వేసి బాగా కలపాలి. అవసరమైతే
కొద్దిగా నీళ్లు చల్లి పిండిని మిల్ మేకర్లకు బాగా పట్టించాలి.
స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత మిల్
మేకర్ ముక్కలను చిన్న చిన్న పకోడీలుగా వేసి బంగారు రంగు వచ్చే వరకు
వేయించాలి.
వేయించిన పకోడీలను టిష్యూ పేపర్ వేసిన ప్లేట్ లోకి తీసుకోండి.
చివరగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు
వేసి బాగా కలపండి.
వేడి వేడి మిల్ మేకర్ పకోడీని టొమాటో సాస్ లేదా మీకిష్టమైన చట్నీతో
సర్వ్ చేయండి.
చిట్కాలు:
పకోడీలు మరింత క్రిస్పీగా రావాలంటే, పిండిలో కొద్దిగా వంట సోడా
వేయవచ్చు.
మీ రుచికి అనుగుణంగా మసాలాలను మార్చుకోవచ్చు.
ఈ పకోడీలు టీ సమయానికి లేదా పార్టీలకు మంచి స్నాక్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications