Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
ఘుమఘుమలాడే కాశ్మీరీ చికెన్ మసాలా.. ఇది తింటే బట్టర్ చికెన్ మర్చిపోతారు, ఇంట్లోనే చేసుకునే విధానం ఇదే
చికెన్ వంటకాలంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. ఇవి అద్భుతమైన రుచితో ఉంటాయి. చిన్న పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడి తినే ఈ వంటకాలు రకరకాల ప్రదేశాల్లో రకరకాలుగా వండుకుంటుంటారు. అందులో ఒకటే కాశ్మీరీ చికెన్ మసాలా. అబ్బా ఇది నెక్స్ట్ లెవెల్ రుచిగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులోని మసాలాలు ఈ కూరను మరింత రుచికరంగా.. అద్భుతంగా మారుస్తాయి. ఒక్క ముద్ద తింటే చాలు.. కడుపు ఫుల్లుగా ఉన్నా, ప్లేట్ కంచం మొత్తం నాకేస్తారు. కానీ దీనిని తినాలంటే రెస్టారెంట్‌కు వెళ్లలేని వారు ఇంట్లోనే చేసుకోవాలని అనుకుంటారు. కానీ వారికి ఎలా చేసుకోవాలో తెలియదు. అందుకే ఈ స్టోరీలో ఈ కాశ్మీరీ చికెన్ మసాలా ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది వివరించాము. పూర్తిగా చదివి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి.
కాశ్మీరీ చికెన్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు:
చికెన్ - 500 గ్రాములు
జీడిపప్పు - 100 గ్రాములు
ఎండుద్రాక్ష - 50 గ్రాములు
పసుపు - ½ టీస్పూన్
జీలకర్ర పొడి - ½ టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - ½ టీస్పూన్
కాశ్మీరీ మిర్చి పొడి - 1 టీస్పూన్
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
టొమాటో (తరిగినది) - 1
నీరు - 1 కప్పు (అవసరానుసారం)
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - గార్నిష్ కోసం

కాశ్మీరీ చికెన్ మసాలా తయారీ విధానం:
ఈ కాశ్మీరీ చికెన్ మసాలా తయారు చేసుకోవడానికి ముందు.. జీడిపప్పు, ఎండుద్రాక్షను కొద్దిసేపు నీళ్లలో నానబెట్టి, ఆ తరువాత మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని.. అందులో పసుపు, జీలకర్ర పొడి, కాశ్మీరీ మిర్చిపొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో చికెన్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక ముప్పై నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. అంతే 30 మూత కప్పి పక్కన పెట్టుకోవాలి.
షుగర్ ఉన్న వారికి ఈ పువ్వు సంజీవని లాంటిది.. ఒక్కటి తింటే, చిటికెలో షుగర్ మటుమాయం!
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడెక్కిన తరువాత అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకొని.. మీడియంగా వేయించుకోవాలి. ఆ తరువాత ఆ చికెన్ ముక్కలన్నిటినీ వేరే గిన్నెలో తీసుకోవాలి. ఆ తరువాత అదే కడాయిలో తరిగిన టమాటో ముక్కలను వేసుకోవాలి. అవి మెత్తబడేవరకు వాటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఆ టొమాటోలు అరకప్పు నీళ్లు పోసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ మిశ్రమంలో ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు, ఎండుద్రాక్షల పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు ఆ మిశ్రమంలో వేపుకొని పక్కన పెట్టుకున్న ముక్కలను వేసుకొని మళ్ళీ పది నుంచి పదిహేను నిమిషాల పాటు మూతపెట్టుకొని బాగా మరిగించుకోవాలి. తరువాత సిమ్‌లో ఉడికించుకుంటే చికెన్‌కు మసాలా బాగా పట్టి, చికెన్ మరింత రుచికరంగా మారుతుంది. ఇప్పుడు అందులో కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కలుపుకొని కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసి, ఆ మసాలా మీద కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన కాశ్మీరీ చికెన్ మసాలా సిద్ధమైనట్లే. దీనిని రోటి, నాన్, జీరా రైస్‌తో తినొచ్చు. ఇది అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications