Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అలేఖ్య చిట్టి పికిల్స్ చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసా?.. ఇలా చేస్తే మీ కెరీర్‌లో సెట్ అయినట్లే!
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపించేది, వినిపించే పేరు అలేఖ్య చిట్టి పికిల్స్. వీళ్ళు అమ్మే చికెన్ పచ్చడి సోషల్ మీడియాను గత వారం రోజులుగా తెగ ఊపేస్తోంది. అసలు ఎందుకు వీళ్ళ పేరు ఎక్కువగా వినిపిస్తుందో అని చెప్పడానికంటే ముందు.. వీళ్ళు అమ్మే చికెన్ పచ్చడి ఎందుకంత ఫేమస్ అయ్యింది? అనేది తెలుసుకుందాం. అలాగే ఈ చికెన్ పచ్చడిని ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చికెన్ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్ - 1 కేజీ
నూనె - 1/2 కేజీ
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 5 టేబుల్ స్పూన్లు
ఉప్పు - 50 గ్రాములు
పసుపు - 1 టీ స్పూన్
కారం - 50 గ్రాములు (లేదా మీ రుచికి తగినంత)
మెంతి పొడి - 1 టేబుల్ స్పూన్
ఆవాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 3 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 8-10 (చిన్నగా కట్ చేసుకోవాలి)
కరివేపాకు - కొద్దిగా
ఆవాలు - 1 టీ స్పూన్

చికెన్ పచ్చడి తయారీ విధానం:
చికెన్ పచ్చడి తయారీకి ముందుగా మంచి, బోన్ లెస్ చికెన్ తీసుకోవాలి. ఈ చికెన్‌ను శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలన్నీ సమాంతరంగా ఉండేలా చేసుకోవాలి. అలాంటప్పుడే చికెన్ పచ్చడి తయారైన తరువాత ముక్కలు సరిగ్గా దంతాల కింద తగులుతాయి. అలాగే తిన్న ఫీలింగ్ కలుగుతుంది.
ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలను అందులో వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో చికెన్ వేపుకోవడానికి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక.. అందులో చికెన్ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఆ చికెన్ ముక్కలు దోరగా, క్రిస్పీగా ఉండే విధంగా వేయించుకోవాలి.
ఇప్పుడు అదే నూనెలో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తరువాత అందులో కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆ తరువాత అల్లం పేస్ట్ వేసుకొని, అది పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి.
ఇప్పుడు అందులో ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. అలాగే ఇప్పుడు దానిపై ఉప్పు, కారం, మెంతుల పొడి, ఆవాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలాలు అంతా చికెన్‌కు పట్టుకునే విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తరువాత దానిపై ఒక నిమ్మకాయను కోసి దాని రసాన్ని పోసుకోవాలి. ఇప్పుడు మరోసారి బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకొని పచ్చడిని కిందకు దించుకోవాలి. పచ్చడి పూర్తిగా చల్లారిన తరువాత దానిని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. అంతే ఎంత రుచికరమైన అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమస్.. చికెన్ పచ్చడి సిద్ధమైనట్లే.
ఈ స్టోరీలో మేము ఎవరినీ కించపరచడం లేదు. కేవలం వినోదం కోసం, మరియు మీకు చికెన్ పచ్చడిని ఎలా చేసుకోవాలి అనేది వివరించాము అంతే. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. ఎవరినీ కించపరిచేందుకు కాదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications