Mutton Pappu: మటన్ పప్పు ఎప్పుడైనా తిన్నారా.. తింటే అమృతమే.. ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి!

నాన్ వెజ్‌లో మటన్, వెజ్‌లో పప్పును చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఆంధ్రాలో ఈ రెండిటిని కలిపి మటన్ పప్పు తయారు చేస్తారు. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దీనిని చేసుకుంటారు. ఈ మటన్ పప్పును చేసుకోవడం చాలా సులభం. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచింది. అయితే ఈ మటన్ పప్పును ఏ విధంగా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How to make Mutton pappu recipe in telugu Health benefits with mutton pappu

మటన్ పప్పుకు కావాల్సిన పదార్థాలు

  1. అరకిలో మటన్ ముక్కలు
  2. అర టీస్పూన్ పసుపు
  3. కారం
  4. పావు టీస్పూన్ మిరియాలు
  5. కొంచెం కొత్తిమీర తరుగు
  6. ఒకటి తరిగిన ఉల్లిపాయ
  7. ఒక కట్ట తోటకూర
  8. రెండు తరిగిన టమాటోలు
  9. రెండు లేదా మూడు పచ్చిమిర్చి
  10. ఒక కప్పు శనగపప్పు
  11. నాలుగు లేదా అయిదు వెల్లుల్లి రెబ్బలు
  12. కొద్దిగా జీలకర్ర
  13. నూనె
  14. రుచికి సరిపడా ఉప్పు

మటన్ పప్పు తయారీ విధానం

మటన్ పప్పు తయారు చేయడానికి ముందుగా మటన్ ముక్కలను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో పసుపు, మిరియాల పొడి, కారం వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడయ్యాక అందులో జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకొని బాగా వేయించాలి.

ఉల్లిపాయలు, వెల్లుల్లి ముక్కలు గోల్డెన్ కలర్‌లో వచ్చిన తరువాత అందులో టమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటోలు కూడా మగ్గిన తరువాత అందులో శనగ పప్పు వేసుకొని, ఆ మిశ్రమం అంతా పప్పుకు పట్టుకునే విధంగా కలుపుకోవాలి. అనంతరం రెండు కప్పుల నీరు పోసి మరిగించుకోవాలి.

ఆ తరువాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మటన్ మగ్గిన తరువాత అందులో తోటకూర, పచ్చి మిర్చి కూడా వేసుకొని మటన్ ఉడికించుకోవాలి. ఒకవేళ కారం సరిపడా లేకపోతే ఇప్పుడే కారం కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఓసారి కలుపుకోవాలి. అనంతరం మూత పెట్టి మటన్ కూరను బాగా ఉడికించుకోవాలి. కర్రీ ఉడికిన తరువాత అందులో కొత్తిమీర వేసుకొని, ఇంకో నిమిషం పాటు ఉడకనిచ్చి కిందకు దించుకోవాలి.

అంతే ఎంతో రుచికరమైన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మటన్ పప్పు కూర సిద్ధమైనట్లే. మటన్, పప్పు తినడం వల్ల ఎముకలు బలపడతాయి. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. పిల్లల ఎదుగుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతాయి.

[ of 5 - Users]
Desktop Bottom Promotion