Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బామ్మల కాలంనాటి నువ్వుల బర్ఫీ, తింటే ఐరన్ సమస్యే ఉండదు,ఎలా చేసుకోవాలో తెలుసా?
ఇప్పుడైతే మనకు స్వీట్స్ తినాలనిపించినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి స్వీట్ షాప్ నుంచి తీసుకొని వచ్చేస్తున్నాం. కానీ ఒకప్పుడు మనకు స్వీట్స్ ఏది తినాలనిపించినా బామ్మలు, అమ్మమ్మల దగ్గరికి వెళ్లి నాకు ఇది చేసిపెట్టు అని చెప్పేవాళ్ళం. వాళ్ళు వాళ్లకు తెలిసిన పద్దతిలో ఎంతో రుచికరంగా సులభంగా, ఆరోగ్యవంతంగా చేసి ఇచ్చేవాళ్ళు. అలాంటి వాటిలో ఒకటే నువ్వుల బర్ఫీ. ఇది చాలా మంది తమ బామ్మలతో చేయించుకొని తినే ఉంటారు. కానీ ఇప్పుడు చేసుకోవడం మాత్రం రాదు. అందుకే ఈ స్టోరీలో నువ్వుల బర్ఫీ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నువ్వుల బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు:
నువ్వులు - 1 కప్పు
పంచదార - 1 కప్పు
ఒక కప్పు పాలు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - 1/4 టీస్పూన్
నువ్వుల బర్ఫీ తయారీ విధానం:
నువ్వుల బర్ఫీ తయారు చేసుకోవడం చాలా సులభం. చాలా సులభమైన పద్దతిలో దీనిని ఎలా తయారుచేసుకోవాలంటే.. ముందుగా ఒక నాన్-స్టిక్ పాన్‌లో నువ్వులు వేసుకోవాలి. ఆ నువ్వులు గోధుమ రంగు వచ్చేంతవరకు బాగా వేయించుకొని, ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లార్చుకోవాలి.
ఇప్పుడు మరొక పాన్‌లో పంచదార, నీరు వేసుకొని మరిగించుకోవాలి. పంచదార కరిగి పాకంలా మారే వరకు ఉడికించుకోవాలి. పాకం అయిపోయిన తరువాత ఆ పాకంలో నువ్వులు వేసుకోవాలి. అలాగే యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే అందులో కొంచెం పాలు వేసుకొని మరోసారి కలుపుకోవాలి.
పాలన్నీ పాకానికి పట్టుకున్న తరువాత అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఆ తరువాత ఆ నువ్వులను బర్ఫీ ఆకారంలో కోసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే బామ్మల కాలం నాటి ఎంతో రుచికరమైన, ఆరోగ్యవంతమైన నువ్వుల బర్ఫీ సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications