Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఆనియన్ పన్నీర్ ఫ్రైడ్ రైస్, ఇలా చేస్తే రెస్టారెంట్లు ఎందుకు చెప్పండి, టేస్ట్ అదిరిపోలా... !!
స్ట్రీట్ ఫుడ్‌లో, పెద్దపెద్ద రెస్టారెంట్ లలో ఆనియన్ పనీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తారో అచ్చం అలాగే మీ ఇంట్లో చెయ్యడం ఎలాగో తెలుసుకోండి. ఆకర్షణీయమైన రంగులు, సువాసనగల ఉల్లిపాయ, పన్నీర్ ఫ్రైడ్ రైస్ కేవలం 10 నిమిషాల్లో మీ ఇంట్లోనే తయారు చేసి అచ్చం హోటల్ లో తిన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది.
చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఈ ఉల్లిపాయ-పనీర్ ఫ్రైడ్ రైస్‌ను ఇష్టపడతారు. ఈ రెసిపీని కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ టేస్టీ రైస్‌ని ఇంట్లో అందరికీ సులభంగా తయారు చేసి వడ్డించవచ్చు. ఈ ఆనియన్-పనీర్ ఫ్రైడ్ రైస్ టేట్ స్ట్రీట్ ఫుడ్‌లో మీకు లభించే రుచిని పోలి ఉంటుంది. ఈ సింపుల్ రిసిపిని ఎలా తయారు చేయాలో చూద్దాం.

ఉల్లిపాయ-పనీర్ ఫ్రైడ్ రైస్ కోసం కావలసినవి
బియ్యం - 1 గిన్నె
నూనె - 2 టీస్పూన్లు
నెయ్యి - 2 టీ స్పూన్లు
లవంగాలు-4
చక్కె - చిన్న ముక్క
ఏలకులు -2
జీలకర్ర - 1 టీస్పూన్
మిరియాలు - పావు టీస్పూన్
బిర్యానీ ఆకు - 1
ఉల్లిపాయ - 3
పన్నీర్ - 50 గ్రాములు
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
పసుపు పొడి - అర టీ స్పూన్
దనియాలపొడి - 1 టీ స్పూన్
ఖారం పొడి- 1 టీ స్పూను
పావ్‌బాజీ మసాలా పౌడర్ - 2 స్పూన్
ఉప్పు - రుచికి కావలసినంత
కొత్తిమీర - కొద్దిగా
ఉల్లిపాయ-పనీర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలి
- స్టవ్ మీద కడాయి పెట్టి అందులో రెండు టీస్పూన్ల నూనె, రెండు టీస్పూన్ల నెయ్యి వేయాలి. (వెడల్పాటి పాన్ తీసుకుంటే వేయించడానికి బాగుంటుంది)
- నూనె, నెయ్యి, 4 లవంగాలు, రెండు యాలకులు, ఒక టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ మిరియాలు, చిన్న మిరియాలు, ఒక బిర్యానీ ఆకు వేసి వేయించాలి.
- తరవాత పొడవుగా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసి దానికి ఒక టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
- అర టీస్పూన్ పసుపు పొడి, ఒక టీస్పూన్ ధనియాల పొడి, ఒక టీస్పూన్ ఖారం పొడి, రెండు టీస్పూన్ల పావ్‌బాజీ మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
- మరో కడాయి స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి అందులో అర టీస్పూన్ ఖారం పొడి, కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేసి పనీర్ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
- దీన్ని ఉల్లిపాయ మిశ్రమంలో వేసి మిక్స్ చేసి చివర్లో కొత్తిమీర తరుగు వేసి, కప్పు అన్నం వేసి మిక్స్ చేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
- స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేయాలి. ఈ ఆనియన్-పనీర్ ఫ్రైడ్ రైస్ చూడటానికి కలర్ ఫుల్ గానూ, తినడానికి కూడా రుచికరంగా ఉంటాయి.
- మీరు తప్పకుండా స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఆనియన్-పనీర్ ఫ్రైడ్ రైస్‌ను బయట డబ్బులు ఎక్కువ ఖర్చు చెయ్యకుండా ఇంట్లోనే తయారు చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఆరగించి ఎంజాయ్ చెయ్యవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications