Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కార్తీక మాసంలో తప్పక తినాల్సిన కూర.. పాలక్ పనీర్ ఎలా చేసుకోవాలో తెలుసా?
దేశంలో ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోంది. పండగల సెలవుల కారణంగా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఈ సమయంలో కొత్త కొత్త వంటలు చేస్తూ తల్లులు వారి పిల్లలకు పెడుతూ ఉంటారు. అందులో అందరికీ ఇష్టమైనది, లంచ్ డిన్నర్‌లో చేసుకునే తినేది పాలక్ పనీర్.
ఇది కార్తీకమాసం కాబట్టి నీస్ ముట్టరు కాబట్టి.. ఇలాంటి సమయంలో ఇది పర్ఫెక్ట్ డిష్. అయితే ఈ డిష్‌ను ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, హోటల్ స్టైల్ రుచి వచ్చే విధంగా చేసుకునే పద్ధతి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా పాలక్ పనీర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం
> 500 గ్రాముల సన్నగా తరిగిన పాలకూర
> 15 నుంచి 16 పనీర్ ముక్కలు
> రెండు టేబుల్ స్పూన్ నూనె
> ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర
> ఒక టేబుల్ స్పూన్ బే ఆకులు
> ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం
> ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి
> 1 కప్పు మెత్తగా నూరుకున్న ఉల్లిగడ్డ
> అర కప్పు టమోటా పేస్ట్
> తగినంత ఉప్పు
> అర టేబుల్ స్పూన్ గరం మసాలా
> అర టేబుల్ స్పూన్ మిరియాలు
> ధనియాల పొడి అర టీ స్పూన్
> 2 మెత్తగా నూరుకున్న ఏలకులు
> ఒక టేబుల్ స్పూన్ క్రీం

పాలక్ పనీర్ తయారీ విధానం
ముందుగా మనం ముక్కలుగా చేసుకున్న పాలకూరను ప్రెజర్ కుక్కర్‌లో వేసి ఉడికించుకోవాలి. అనంతరం వాటిని బాగా రుబ్బుకోవాలి. ఒక పిండి మాదిరిగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అనంతరం ఒక పెనం తీసుకొని.. అందులో సరిపడా నూనె వేసుకొని, మనం తీసుకున్న 15 లేదా 16 పనీర్ ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలి. లేత బంగారు రంగులోకి వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి.
తరువాత ఫ్రై చేసిన పనీర్ క్యూబ్స్ తీసేసి అందులో జీలకర్ర వేయాలి. అది బయటికి చిమ్మినప్పుడు.. అందులో బే ఆకులు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలి. తరువాత.. ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం టమోటా ముద్దను వేసి బాగా కలిపి.. కాసేపు ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఆ మిశ్రమంలో మనం ముందుగా చేసిపెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. కాసేపు అది ఉడికాక.. అందులో పనీర్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్న గ్రేవీలో పనీర్ ముక్కలు మొత్తం నానే విధంగా ఆ ముక్కలను కలుపుకోవాలి.
అనంతరం ఆ కూరలో క్రీంను మిక్స్ చేసుకొని.. కూరకు బాగా పట్టే విధంగా కలుపుకుంటే సరి. ఎంతో రుచికరమైన పాలక్ పనీర్ కూర సిద్ధమైనట్లే. దీనిని గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications