Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
డిన్నర్‌లో వేడివేడి అన్నంలో పాలకూర్ ఉల్లికారం కలుపుకొని తింటే...!!
పాలకూర ఉల్లికారం డిన్నర్‌లో వేడి వేడి అన్నంలో తింటే ఆ రుచి మామూలుగా వుండదు. పాలకూర ఉల్లికారాన్ని చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చు. దీనికోసం మార్కెట్ నుంచి ప్రత్యేకంగా ఎక్కువ వంటసామాగ్రి తెచ్చుకోనవసరం కూడా లేదు. పాలకూర ఉల్లికారం కోసం కావలసింది ముఖ్యంగా పాలకూర, ఉల్లిపాయలు, కారంపొడి, వెల్లుల్లిపాయలు, చింతపండు, ఉప్పు, కారం, ఎండిమిరపకాయలు, కరివేపాకులు, పసుపు. ఇవన్నీ దాదాపు అందరి ఇళ్లల్లో వుంటాయ్. కాబట్టి చేయడం చాలా సులభం. ఈ పాలకూర ఉల్లికారంతో రుచి మాత్రమే కాదు శరీరానికి మంచి పోషకాలు కూడా అందుతాయ్. పాలకూరలో ఐరన్ సంమృద్ధిగా వుంటుంది. ఇక చింతపండులో వైటమిన్ సి, వెల్లుల్లి, జిలకరలో వైటమిన్లు, మినరల్స్ పుష్కలంగా వుంటాయ్. కాబట్టి ఈ పాలకూర ఉల్లికారం రుచి మాత్రమే కాదు మంచి పోషకాలు అందించే కూర కూడా.

పాలకూర ఉల్లికారం చేసుకోవడానికి ఈ పదార్ధాలు వుంటే సరిపోతుంది.
పాలకూర
3 ఉల్లిపాయలు
వెల్లుల్లిపాయలు, జిలుకర
3 స్పూన్ల కారంపొడి
1 టీ స్పూన్ ఉప్పు
నానబెట్టుకున్న చింతపండు
మంచి నూనె
తాలింపు గింజలు
4 ఎండిమిరపకాయలు
కొన్ని కరివేపాకులు
చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు

పాలకూర ఉల్లికారం రెసిపీని ఈ కింది విధంగా సింపుల్‌గా చేసుకోండి
1. పాలకూరను బాగా కడిగి వాటికి వున్న కాడలను కట్ చేసుకోవాలి.
2. పాలకూరను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి.
3. కట్ చేసుకొని ప్లేట్‌లో వేసుకోవాలి.
4. మిక్సీ జార్‌లో మూడు ఉల్లిపాయలను కట్ చేసుకొని
వేసుకోవాలి.
5. వెల్లుల్లిపాయలను, జిలుకరను, మూడు స్పూన్ల కారంపొడి, 1 టీస్పూన్
ఉప్పు, నానబెట్టుకున్న
6. చింతపండును కూడా మిక్సీలో వేసుకోవాలి.
7. మొత్తం గ్రైండ్ చేసుకోవాలి.
8. స్టవ్‌పై ప్యాన్ పెట్టి అందులో మూడు గంటల మంచి నూనెను
పోసుకోవాలి.
9. ఒక స్పూన్ తాలింపు గింజలను, వెల్లుల్లిపాయలను, 4 ఎండిమిరపకాయలను,
కొన్ని కరివేపాకులను, నూనెలో ఫ్రై అయిన తరువాత గ్రైండ్ చేసిన పేస్టును
అందులో వేసుకోవాలి.
10. ప్యాన్‌లో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి.
11. కట్ చేసిపెట్టుకున్న పాలకూరను ప్యాన్‌లో వేసుకోవాలి.
12. చిటికెడు పసుపు, చిటికెడంత ఉప్పును వేసుకోవాలి. మంటను మీడియం
ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి.
13. కొద్దిగా కొత్తిమీరను చల్లుకోవాలి.
14. ఇక దీంతో మీ పాలకూర ఉల్లికారం రెడీ అయినట్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications