Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
పనీర్ బటర్ మాసాలా ఇప్పుడు అన్ని వెజిటేరియన్ కూరల్లో టాప్ ప్లేస్‌లో ఉంది. ఉత్తర భారతంలో పుట్టిన ఈ కర్రీ ఇప్పుడు దక్షిణ భారతంలో కూడా ఇష్టంగా వండుకొని తింటున్నారు. పన్నీర్, బటర్, మసాలా వాసన అమోఘంగా ఉంటుంది. ఇక రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బటర్ నాన్, చపాతీతో ఈ కర్రీని కలుపుకొని తింటే ఆ ఆనందాన్ని మాట్లల్లో వర్ణించలేము. అయితే ఈ బటర్ పనీర్ మసాలాను ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.
బటర్ పనీర్ మసాలా తయారు చేసే విధానం
ఒక ప్యాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి అందులో 250 గ్రాముల పనీర్ వేసే బాగా కలుపుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకుండా చిన్న మంటపైనే కలుపుకోవాలి.
మసాలా పేస్ట్
మరో ప్యాన్‌లో నాలుగు టేబుల్ స్పూన్ల మంచి నూనె వేసి అందులో కావలసినన్ని కాజూ ముక్కలు, కర్బూజా ముక్కలు, ఎండుకొబ్బరి ముక్కలు వేసి కలుపుకోవాలి, రెండు నిమిషాల తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, ఒక ఉల్లిపాయను ముక్కలుగా కోసి అందులో వేసుకోవాలి. ఒక స్పూన్ గసాలు కూడా వేసి కలుపుకోవాలి. రెండు నిమిషాలు కలిపిన తరువాత నాలుగు టోమాటోలను ముక్కలుగా కోసి అందులో వేయాలి. టమాటోలు బాగా ఉడికేంతవరకు కలుపుకొని ప్యాన్‌లో ఉన్న మొత్తాన్ని మిక్సీలోకి తీసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

ప్యాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల బటర్, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కొంచెం కాగిన తరువాత అందలో అర స్పూన్ జీలకర్ర, అరస్పూన్ జీలకర్ర, అరస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. మళ్లీ అందులో తగినంత ఉప్పు, ధనియాల పొడి, రెండు స్పూన్ల కారం వేసి, నాలుగు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి.
పనీర్ బటర్ మసాలా రెడీ
ఇక అంతకు ముందు మిక్సీలో పేస్ట్‌గా గ్రైండ్ చేసుకున్న
దాన్ని ఈ ప్యాన్‌లో వేసి కలుపుకోవాలి.
తరువాత అందులో ఒక కప్పు నీళ్లు వేసి కలుపుకోవాలి. చిన్న
ఫ్లేమ్‌పై ఈ గ్రేవీ మొత్తం ఉడికిన తరువాత అందులో ఫ్రై
చేసుకున్న పనీర్ ముక్కలను వేయాలి. ఇందులో రెండు స్పూన్ల బటర్
వేసుకుంటే టేస్ట్ సరిగ్గా సరిపోతుంది. ఇక ఫైనల్‌గా పనీర్
బటర్ మసాలా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
