Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
పెసరపప్పుతో హల్వా..మండుటెండల్లో తింటే శరీరానికి చలువ,ఎలా చేయాలంటే
హల్వా పేరు చెప్పగానే కొంతమందికి నోట్లో నీళ్లు ఊరిపోతుంటాయి. హల్వాలో అనేక వెరైటీలు ఉంటాయి. దేని టేస్ట్ దానిదే. హల్వా వెరైటీస్ లో పెసరపప్పు హల్వా ఒకటి. భారతదేశంలో ఒక ప్రసిద్ధ సాంప్రదాయ స్వీట్. ఇది రుచికరమైనది మాత్రమే కాదు,పోషక విలువలు కూడా కలిగి ఉంటుంది. పెసరపప్పుతో తయారు చేయబడిన ఈ హల్వా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పెసరపప్పు హల్వాని ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. పెసరపప్పు హల్వా తయారుచేయడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
పెసరపప్పు హల్వా తయారీకి కావలసిన పదార్థాలు
పెసరపప్పు: 1 కప్పు
నెయ్యి: 1 కప్పు
పంచదార: 1 1/2 కప్పులు
పాలు: 1/2 కప్పు
యాలకుల పొడి: 1/2 టీ స్పూన్
జీడిపప్పు, బాదం, కిస్మిస్: కొద్దిగా

పెసరపప్పు హల్వా తయారీ విధానం
-ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి కనీసం 4-5 గంటలు నీటిలో నానబెట్టండి
-తర్వాత నానిన పెసరపప్పును నీరు లేకుండా వడగట్టి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
-ఇప్పుడు ఒక మందపాటి కడాయిలో నెయ్యి వేడి చేయాలి.
-నెయ్యి వేడయ్యాక అందులో పెసరపప్పు పేస్ట్‌ను వేసి చిన్న మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.
-పెసరపప్పు వేగుతున్నప్పుడు అది కడాయికి అంటుకోకుండా కలుపుతూ ఉండాలి.
-పెసరపప్పు బాగా వేగిన తర్వాత అందులో పాలు పోసి బాగా కలపండి.
-పాలు కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇందులో చక్కెర వేసి కరిగే వరకు కలపాలి.
-హల్వా చిక్కబడే వరకు నెయ్యి పైకి తేలే వరకు చిన్న మంటపై ఉడికించాలి.
-చివరగా యాలకుల పొడి వేసి కలపాలి.
-జీడిపప్పు, బాదం, కిస్మిస్ తో అలంకరించి స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడివేడిగా లేదా చల్లగా దీనిని ఆస్వాదించవచ్చు.
చద్దన్నంలో ఈ చేపలు పెట్టుకొని తింటే.. జన్మకి ఇంకేదీ అక్కర్లేదనిపిస్తుంది,ఎలా చేయాలంటే
పెసరపప్పు ప్రయోజనాలు ఇవే
పెసరపప్పులో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. పెసరపప్పు శరీరానికి చలువ చేస్తుంది. వేసవి కాలంలో దీనిని తినడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. పెసరపప్పులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. పెసరపప్పులో కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల, ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. దీనిని తినడం వల్ల రోజంతా హుషారుగా ఉంటారు. పెసరపప్పులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీనివల్ల అతిగా తినడం తగ్గుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది.
పెసరపప్పులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. షుగర్ పేషెంట్లకు ఇది మంచి ఆప్షన్. మధుమేహం ఉన్నవారు పంచదారను తక్కువగా ఉపయోగించాలి.పెసరపప్పులో పొటాషియం ఉండటం వల్ల, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది. పెసరపప్పులో యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. పెసరపప్పులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల, ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications