Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
డిన్నర్లో ఈ వేపుడు చేసుకొని తింటే, ముద్ద మిగల్చకుండా కంచం నాకేస్తారు, ఎలా చేసుకోవాలంటే?
డిన్నర్లో చాలా మందికి ఏదైనా వేపుడు ఉండాల్సిందే. వేపుడు లేకపోతే ముద్ద కూడా దిగదు. అందుకే రాత్రుళ్ళు డిన్నర్ చేసే ముందు చికెన్ వేపుడు లేదా ఏదైనా వెజ్ వేపుడు చేసుకొని తింటుంటారు. కానీ రొయ్యల వేపుడుని ట్రై చేశారా? ఇంట్లోనే దీనిని అద్భుతంగా రుచిగా చేసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం కూడా అత్యంత సులభం. అసలు ఈ రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రొయ్యల వేపుడు తయారీకి కావలసిన పదార్థాలు:
రొయ్యలు: 500 గ్రాములు (శుభ్రం చేసి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1 పెద్దది (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి: 2-3 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
కారం: 1 టీ స్పూన్
పసుపు: 1/2 టీ స్పూన్
ధనియాల పొడి: 1 టీ స్పూన్
గరం మసాలా: 1/2 టీ స్పూన్
నూనె: 3-4 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: కొద్దిగా
కరివేపాకు: కొన్ని రెమ్మలు

తయారుచేసే విధానం:
- రొయ్యలను శుభ్రంగా కడిగి, వాటికి కొంచెం ఉప్పు, పసుపు వేసి 15 నిమిషాలు నానబెట్టండి.
- తరువాత కడాయిలో నూనె వేడి చేసి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.
- అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించండి.
- కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపండి.
- నానబెట్టిన రొయ్యలను వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
- రొయ్యలు పూర్తిగా ఉడికే వరకు మీడియం మంట మీద వేయించండి.
- చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసి కలపండి.
- అంతే వేడి వేడి రొయ్యల వేపుడు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
