Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
రాజస్థాన్ స్పెషల్ పచ్చిమామిడి కంజి వడ..సమ్మర్ లో తినాల్సినదే ఇది గురూ..ఎలా చేయాలంటే
సమ్మర్ వచ్చేసింది. మామిడికాయలు కూడా వచ్చేశాయి. పచ్చిమామిడికాయలు మార్కెట్ లో లభిస్తున్నాయి. పచ్చమామిడికాయతో అనేక రకాలు వంటలు ట్రై చేసి ఉంటారు. అయితే ఈ సారి కంజి వడలు ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటాయి. కంజి వడలు రాజస్థాన్‌లోని సాంప్రదాయక వంటకం. ఇది రుచికరమైన ఆరోగ్యకరమైన వంటకం. దీనిని వేసవిలో ఎక్కువగా తయారుచేస్తారు. పచ్చిమామిడికాయ కంజి వడలు మీరు కూడా ఇంట్లో తయారుచేసుకోవాలంటే కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
పచ్చి మామిడి కంజి వడ తయారీకి కావలసిన పదార్థాలు
పచ్చి మామిడికాయ: 1
శనగపిండి: 1 కప్పు
పెసరపప్పు: 1/2 కప్పు (రాత్రంతా నానబెట్టాలి)
ఆవాలు: 1 టేబుల్ స్పూన్
మెంతులు: 1/2 టీస్పూన్
హింగ్: 1/4 టీస్పూన్
కారం: 1 టీస్పూన్
పసుపు: 1/2 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: వేయించడానికి సరిపడా
నీరు: అవసరమైనంత

తయారీ విధానం
-ముందుగా పెసరపప్పుని రాత్రంతా నానబెట్టాలి.
-తర్వాత ముందుగా పచ్చి మామిడికాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి.
-ఇప్పుడు పెసరపప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
-ఒక గిన్నెలో శనగపిండి, పెసరపప్పు పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి.
-కొద్దిగా నీరు పోసి పిండిని వడలు వేయడానికి అనుకూలంగా కలుపుకోవాలి.
-ఒక కడాయిలో నూనె వేడి చేసి చిన్న చిన్న వడలుగా వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఎక్కువసేపు నూనెలో వేయించకూడదు, లేకపోతే అవి గట్టిగా అవుతాయి.
-వేయించిన వడలను పక్కన పెట్టుకోవాలి.
-ఒక గిన్నెలో నీరు పోసి పచ్చి మామిడికాయ ముక్కలు, ఆవాలు, మెంతులు,
హింగ్, ఉప్పు వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని 2-3 రోజులు పులియబెట్టాలి. కంజిని పులియబెట్టడానికి
ఎండలో ఉంచితే త్వరగా పులుస్తుంది.
-పులియబెట్టిన కంజిలో వేయించిన వడలు వేసి 1-2 గంటలు నానబెట్టాలి. కంజి వడలు రెడీ. కంజిని మీ రుచికి అనుగుణంగా పుల్లగా లేదా తీపిగా చేసుకోవచ్చు.
పంజాబీ స్పెషల్ రెసిపి..ఒక్కసారి తింటే వన్స్ మోర్ అని తీరాల్సిందే, ఎలా చేయాలంటే
కంజి వడ ప్రయోజనాలు
పచ్చి మామిడికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఇది కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. ఆవాలు, మెంతులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కంజి వడలు శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. కంజి వడలు వేసవిలో డీహైడ్రేషన్ ను నివారిస్తాయి. ఇది శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications