Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఈ పానీయం తాగితే ఎండాకాలంలో ఎలాంటి రోగాలు రావు,రుచి కూడా అద్భుతం, ఎలా చేసుకోవాలంటే?
అరటిపండు తినడం వలన శరీరానికి ఎంతో మంచిదని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఉదయాన్నే ఈ బనానా తినడం వలన శరీరానికి శక్తి అందడంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. ముఖ్యంగా రెడ్ బనానా తినడం వలన శరీరానికి కావాల్సిన పోషకాలు దొరుకుతాయని, వాటిలో ఉండే ఫైబర్ శరీరానికి ఎంతో మంచి జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే ఈ రెడ్ బనానాతో స్మూథి చేసుకొని ఎండాకాలం తాగితే చాలా మంచిది. అందుకే రెడ్ బనానా స్మూథి ఎలా చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రెడ్ బనానా స్మూథి తయారుచేయడానికి కావలసిన పదార్థాలు:
బాగా పండిన ఎర్ర అరటిపండు - 1
పాలు లేదా బాదం పాలు - 1 కప్పు
తేనె లేదా మాపుల్ సిరప్ - 1 టేబుల్ స్పూన్)
చియా గింజలు లేదా అవిసె గింజలు - 1 టేబుల్ స్పూన్
ఐస్ ముక్కలు - కొన్ని
దాల్చిన చెక్క పొడి - చిటికెడు

తయారుచేసే విధానం:
ముందుగా ఎర్ర అరటిపండును తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్
చేసుకోవాలి.
తర్వాత బ్లెండర్‌లో కట్ చేసుకున్న అరటిపండు ముక్కలు, పాలు
లేదా బాదం పాలు, తేనె లేదా మాపుల్ సిరప్, చియా గింజలు లేదా అవిసె
గింజలు, ఐస్ ముక్కలు, దాల్చిన చెక్క పొడి వేసి బాగా బ్లెండ్
చేయాలి.
ఈ మిశ్రమాన్ని మెత్తగా, క్రీమీగా అయ్యే వరకు బ్లెండ్ చేయాలి.
తర్వాత ఈ స్మూతీని గ్లాసులోకి తీసుకుని సర్వ్ చేయాలి.
మీకు నచ్చితే పైన కొన్ని అరటిపండు ముక్కలు లేదా గింజలతో
అలంకరించుకోవచ్చు.
తెలుగింటి అసలైన రోటి పచ్చడి ఇదే గురూ, రుచి మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది, ఎలా చేసుకోవాలో తెలుసా?
రెడ్ బనానా స్మూథి ఆరోగ్య ప్రయోజనాలు:
ఇందులో పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి6, మెగ్నీషియం, ఫైబర్ వంటి
పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
శక్తిని అందిస్తుంది.
ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో
సహాయపడతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications