Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్, ఇలా చేసుకుంటే పిల్లలు మళ్ళీ స్నాక్స్ అడగరు.. సింపుల్‌గా ఎలా చేసుకోవాలంటే?
రెస్టారెంట్‌కి వెళ్ళగానే ప్రతిఒక్కరూ ఆర్డర్ చేసేది స్టార్టర్. అందులో భాగంగా ఆ రెస్టారెంట్ ప్రతినిధి మనకు క్రిస్పీ కార్న్ ఇస్తుంటారు. ఇవి తినడానికి క్రిస్పీగా, చాలా రుచికరంగా కారకరలాడుతుంటాయి. ఆ రెస్టారెంట్ మాత్రమే ఆ రుచి దొరుకుతుంది అని మరీ తింటూ ఉంటాము. అయితే ప్రతిసారి తినాలనిపించినప్పుడు రెస్టారెంట్‌కు వెళ్లలేము కదా? అందుకే ఈ స్టోరీలో రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఇది చేసుకోవడానికి ఏ విధమైన పద్ధతులు వాడాలి అనేది తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
స్వీట్ కార్న్ గింజలు: 1 కప్పు
కార్న్‌ఫ్లోర్: 4 టేబుల్ స్పూన్లు
బియ్యప్పిండి: 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి: 1/2 టీస్పూన్
ఉప్పు: రుచికి తగినంత
నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

తయారీ విధానం:
- ముందుగా స్వీట్ కార్న్ గింజలను ఉడికించుకోవాలి.
- ఉడికించిన కార్న్ గింజలను ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో కార్న్‌ఫ్లోర్, బియ్యప్పిండి, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
- అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లి, పిండిని కార్న్ గింజలకు బాగా పట్టించాలి.
- డీప్ ఫ్రై చేయడానికి నూనెను వేడి చేయాలి.
- నూనె వేడెక్కిన తర్వాత, కార్న్ గింజలను కొద్దికొద్దిగా వేసి, బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
- వేయించిన కార్న్ గింజలను ఒక టిష్యూ పేపర్‌పై వేసి, అదనపు నూనెను తొలగించాలి.
- క్రిస్పీ కార్న్ సిద్ధం. దీనిని టొమాటో కెచప్ లేదా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయవచ్చు.
చిట్కాలు:
కార్న్ గింజలను క్రిస్పీగా వేయించడానికి, నూనె బాగా వేడిగా
ఉండాలి.
కార్న్ గింజలను ఎక్కువసేపు వేయించకుండా, బంగారు రంగు రాగానే
తీసేయాలి.
మీ రుచికి అనుగుణంగా, కారం, చాట్ మసాలా వంటి మసాలాలు కూడా
వేసుకోవచ్చు.
క్రిస్పీ కార్న్ ను మరింత రుచికరంగా చేయడానికి, వేయించిన తర్వాత
కొద్దిగా నిమ్మరసం చల్లుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications