Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Sambar Upma: ఉప్మా తిని బోర్ కొట్టిందా? ఈ సారి సాంబార్ ఉప్మా ట్రై చేయండి.. ఎలా చేసుకోవాలంటే?
హాస్టల్లలో తినో, లేదా ఇంట్లో అమ్మ ఎక్కువగా ఉప్మా చేయడం వల్లనో తెలియదు కానీ ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. దానిని తినాలంటేనే కొందరు తమ మొహం తిప్పేసుకుంటారు. అంతలా బోర్ కొట్టేస్తుంటుంది కొందరికి. అలా ఉప్మా అంటే చిరాకు పడే వారికి ఈసారి కొత్తగా ఇలా సాంబార్ ఉప్మా చేసి పెట్టండి. దీనిని ఉదయం టిఫిన్ మాదిరిగా అయినా లేదా మధ్యాహ్నం లంచ్ మాదిరిగా అయినా చేసుకొని తినేయొచ్చు. అయితే ఈ సాంబార్ ఉప్మా ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సాంబార్ ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు
- ఉప్మా రవ్వ
- సాంబార్
- ఉల్లిపాయలు
- కారం
- కొత్తిమీర
- నెయ్యి
- ఉప్పు
- నీళ్లు

సాంబార్ ఉపమా తయారు చేసుకునే విధానం
ఈ సాంబార్ ఉప్మాను తయారు చేసుకోవడం చాలా సులభం. ముందుగా ఒక పాత్ర తీసుకొని స్టవ్‌పైన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం నెయ్యి వేసుకొని వేడి చేయాలి. దీనిలో రవ్వ వేసుకొని లేత బంగారు వర్ణంలో వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు లేత బంగారు వర్ణంలో వేయించుకున్న ఉప్మాలో సాంబార్ వేసుకొని కలుపుకోవాలి.
అందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కావాల్సినంత నీరు పోసుకొని, ఉప్పు పోసుకొని మూత పెట్టుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. ఉడికిన తరువాత కొంచెం కొత్తిమీర వేసుకొని కాసేపు ఉడికించి కిందకు దించుకుంటే సాంబార్ ఉప్మా సిద్ధమైనట్లే.
ఈ వేడి వేడి సాంబార్ ఉప్మాలో ఆవకాయ లేదా చట్నీ వీలైతే కొంచెం సాంబార్ వేసుకొని తింటే.. అబ్బా ఆ రుచి వేరే లెవెల్ అంతే. దీనిని ఓసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, కచ్చితంగా మీరు ఫ్యాన్ అయిపోతారు. మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా దీనిని తింటారు. నాది గ్యారెంటీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications